మేడ్చల్ జిల్లా కీసర ఠాణా పరిధిలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఓ యువకుడిని పోలీసులు కాపాడారు. కీసర పోలీస్ స్టేషన్ పరిధి దాయరకు చెందిన ప్రవీణ్.... పాల వ్యాపారం చేస్తున్నాడు. పాడి గేదెలు కొనడం కోసం తన తల్లిని రూ. లక్షరూపాయలు అడిగాడు. అందుకు ఆమె నిరాకరించడం వల్ల తల్లితో గొడవపడి ఇంటి నుంచి వెళ్లిపోయాడు. పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంటున్నానని (suicide attempt) తమ్ముడు నవీన్‌కు ఫోన్ చేసి చెప్పాడు.
సాంకేతిక సహకారంతో ఆచూకీ
అప్రమత్తమైన నవీన్... అన్నకోసం గాలించగా ఆచూకీ దొరకలేదు. ఈ విషయమై పోలీసులకు సమాచారం ఇచ్చాడు. సెల్‌ఫోన్ సిగ్నల్ ఆధారంగా బొమ్మలరామారం మండలం పెద్ద పర్వతాపురం సమీపంలో ఉన్నట్లు గుర్తించారు. ఘటనాస్థలికి చేరుకుని అపస్మారకస్థితిలో ఉన్న ప్రవీణ్‌ను గస్తీ వాహనంలో ఆస్పత్రికి తరలించారు. సకాలంలో స్పందించిన కానిస్టేబుళ్లు కృష్ణంరాజు, కుమారస్వామిని బాధితుడి తల్లిదండ్రులు, స్నేహితులు, వైద్యులు అభినందించారు.
ఇదీ చూడండి:Kidnap: నా భార్యను కిడ్నాప్ చేశారు.. న్యాయం చేయండి..