POLICE RAID ON HORSE RIDING CLUB : హార్స్ రైడింగ్ క్లబ్‌లో బర్త్‌డే పార్టీ.. గంజాయితో... - police raid on horse riding club in ajij nagar
09:20 October 22
POLICE RAID ON HORSE RIDING CLUB : హార్స్ రైడింగ్ క్లబ్‌లో పుట్టినరోజు వేడుకలు..
రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం అజీజ్‌నగర్‌లోని హార్స్‌రైడింగ్ క్లబ్‌లో పోలీసులు సోదాలు(POLICE RAID ON HORSE RIDING CLUB) నిర్వహించారు. మంగళవారం అర్ధరాత్రి జరిపిన ఈ సోదాల విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 25 మంది యువతీయువకులు కలిసి క్లబ్‌లో పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నారు. ఈ వేడుకల్లో వారు గంజాయి సేవిస్తున్నట్లు ఎస్ఓటీ పోలీసులకు సమాచారం అందింది.
వెంటనే ఆ క్లబ్‌కు చేరుకున్న పోలీసులు సోదాలు(POLICE RAID ON HORSE RIDING CLUB) చేశారు. ఈ సోదాల్లో 20 గ్రాముల గంజాయి(cannabis seized) దొరికింది. గంజాయిని స్వాధీనం చేసుకుని, ఆ యువతీయువకులను అరెస్టు చేశారు. అనంతరం వారిని స్థానిక పోలీస్ స్టేషన్లో అప్పగించారు. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. గంజాయిని ఎవరెవెవరు సేవించారు? ఎక్కడి నుంచి విక్రయించారు? గంజాయి తీసుకోవడమేనా లేదా సరఫరా కూడా చేస్తున్నారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం.