Alcohol bottles Destroyed in Ntr District: రెండేళ్లలో తెలంగాణ నుంచి అక్రమంగా రవాణా చేస్తూ పోలీసులకు దొరికిన రూ. 5.47 కోట్ల విలువైన మద్యం సీసాలను ఆంధ్రప్రదేశ్ పోలీసులు ధ్వంసం చేశారు. తోటచర్ల జాతీయ రహదారి పక్కనున్న ప్రైవేటు వెంచరులో సీపీ కాంతిరాణా టాటా, డీసీపీ మేరీ ప్రశాంతి, ఎస్‌ఈబీ ఏఎస్పీ సత్తిబాబు పర్యవేక్షణలో మద్యం సీసాలను ధ్వంసం చేశారు.
నందిగామ సబ్ డివిజన్ పరిధిలో మద్యం అక్రమ రవాణాకు సంబంధించి పలు పోలీస్‌స్టేషన్లలో 6,075 కేసులు నమోదు అయినట్లు సీపీ కాంతిరాణా టాటా తెలిపారు. వివిధ బ్రాండ్లకు చెందిన 2,43,385 మద్యం సీసాలు పట్టుకున్నట్లు చెప్పారు. ఒకేసారి రూ.5.47 కోట్ల విలువైన మద్యం సీసాలను ధ్వంసం చేయడం రాష్ట్రంలో ఇదే మొదటిసారి అని చెప్పారు.