మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర పరిధిలోని పలు విత్తన దుకాణాల్లో టాస్క్ ఫోర్స్ పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ప్రభుత్వ నిషేధిత 1212 పత్తి విత్తనాల ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. నిబంధనలు పాటించని 8 మంది వ్యాపారులపై కేసులు నమోదు చేశారు.
Illegal seeds: భారీగా నకిలీ విత్తనాలు స్వాధీనం.. నిందితుల అరెస్ట్ - fake seeds seize
మహబూబ్ నగర్ జిల్లాలో నకిలీ విత్తనాలు విక్రయిస్తున్న వారిపై పోలీసులు కొరడా ఝులిపించారు. దేవరకద్ర పరిధిలోని పలు ఫర్టిలైజర్ దుకాణాల్లో తనిఖీలు నిర్వహించి నకిలీ విత్తనాలను భారీగా స్వాధీనం చేసుకున్నారు.
fake seeds seize
దేవరకద్రలోని మరో దుకాణం నుంచి 92 లీటర్ల నిషేధిత కలుపు నివారణ మందును సీజ్ చేసినట్లు పోలీసులు తెలిపారు. నకిలీ విత్తనాలను విక్రయిస్తే పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేస్తామని వారు హెచ్చరించారు. రైతులు నాణ్యమైన విత్తనాలను మాత్రమే కొనుగోలు చేయాలని సూచించారు.