గంజాయి అమ్ముతున్న తండ్రి, కుమారుడిని జగద్గిరిగుట్ట పోలీసులు అరెస్ట్ చేశారు. మేడ్చల్ జిల్లా గాజులరామారానికి చెందిన కలవేందర్ సింగ్ (75), గురుప్రీత్ సింగ్ (30)ఇద్దరు తండ్రి, కుమారులు. వీరికి గాజులరామారంలో ఓ దాబా ఉంది. కరోనా సమయంలో ఆ దాబా నడవకపోవడంతో డబ్బు సంపాదించాలనే లక్ష్యంతో అక్రమంగా నిషేధిత గంజాయి అమ్మడం ప్రారంభించినట్లు పోలీసులు తెలిపారు.
గంజాయి అమ్ముతున్న తండ్రీ కొడుకు అరెస్ట్ - crime news of telangana
మేడ్చల్ జిల్లాలో గంజాయి అమ్ముతున్న వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
జగద్గిరిగుట్ట పోలీసులు అరెస్ట్ చేశారు
మహారాష్ట్ర నాందేడ్ నుంచి గంజాయిని తీసుకువచ్చి వాటిని 100 గ్రాముల చొప్పున ప్యాకెట్లుగా మార్చి విక్రయిస్తున్నట్లు వివరించారు. సమాచారం అందుకున్న పోలీసులు దాబాలో నిల్వ ఉంచిన 2.2 కేజీల గంజాయి స్వాధీనం చేసుకుని.. ఇద్దరిని అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించారు.
ఇదీ చదవండి:రాష్ట్రంలో నేడు రికార్టు స్థాయిలో విద్యుత్ వినియోగం