నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం కొప్పర్గ శివారులో.. ఇటీవల జరిగిన హత్య కేసు మిస్టరీ వీడింది. ఈనెల 11న అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన వ్యక్తి హత్యకు బావమరిదే కారణమని పోలీసులు నిర్ధరించారు. సోదరిని వేధింపులకు గురి చేయటంతో ఆగ్రహానికి గురైన ప్రకాశ్.. బావ అశోక్‌ను హతమార్చాడని పోలీసులు వెల్లడించారు.
మహారాష్ట్రలోని కర్ల ప్రాంతానికి చెందిన అశోక్.. బిచ్కుంద మండలానికి చెందిన నిందితుడి చిన్నమ్మ కూతురును పెళ్లాడి.. ఇల్లరికం వచ్చాడు. కొద్ది రోజులు బాగానే ఉన్న దంపతుల మధ్య.. కలహాలు చోటుచేసుకున్నాయి. అశోక్.. భార్యను వేధింపులకు గురిచేయడం మొదలుపెట్టాడు. సోదరిని తరచూ ఇబ్బందులకు గురి చేయడం చూసి ప్రకాశ్ తట్టుకోలేకపోయాడు.