పోలీసు అధికారులు, సిబ్బంది.. విధులు నిర్వహించే సమయంలో అప్రమత్తంగా ఉండాలని సిద్దిపేట సీపీ జోయల్ డేవిస్ సూచించారు. కోహెడలో విధులు నిర్వహిస్తూ కొవిడ్ బారిన పడి మృతి చెందిన కానిస్టేబుల్ భీమయ్య(47) మృతి పట్ల ఆయన దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం అందుగులపేటకు చెందిన బైరినేని బీమయ్య.. నాలుగు రోజుల క్రితం కరోనాతో సిద్దిపేట ప్రభుత్వ ఆస్పత్రిలో చేరాడు. పరిస్థితి విషమించడంతో.. ఇవాళ ఉదయం 11 గంటలకు ప్రాణాలు విడిచాడు. మృతుడికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు.