Sexual Harassment on Students: బాలికలపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్న యువకుడిని హైదరాబాద్‌లోని సంతోష్ నగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. సంతోష్ నగర్ మోయిన్‌భాగ్‌లోని ఓ ప్రైవేటు పాఠశాల ఇంఛార్జి కుమారుడు రిజ్వాన్ అహ్మద్... పాఠశాలలో చదువుతున్న పిల్లలకు బిస్కట్లు, చాక్లెట్లు ఆశచూపి గదికి తీసుకెళ్లి లైంగికంగా వేధిస్తున్నాడని... బాధిత పిల్లలు తమ తల్లిదండ్రులకు తెలియజేశారు.
బాలికలపై ఓ ప్రైవేటు పాఠశాల ఇంఛార్జి కొడుకు లైంగిక వేధింపులు.. చివరికి.. - బాలికలను లైంగికంగా వేధిస్తున్న ఓ ప్రైవేటు పాఠశాల ఇంఛార్జి కొడుకు
Sexual Harassment on Students: చిన్నారులు, మహిళలపై లైంగిక దాడులకు వ్యతిరేకంగా ప్రభుత్వం ఎన్ని కఠిన చట్టాలు తెచ్చినా.. కామాంధుల తీరు మాత్రం మారట్లేదు. కామ వాంఛ తీర్చుకునేందుకు చిన్నా పెద్ద, వావివరుసలు మరిచి వారితో అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారు. తాజాగా హైదరాబాద్‌లో బాలికలను లైంగికంగా వేధిస్తున్న ఓ ప్రైవేటు పాఠశాల ఇంఛార్జి కొడుకుని పోలీసులు అరెస్టు చేశారు.
Sexual Harassment
అలాగే ఫోన్‌లో కూడా వీడియోలు రికార్డు చేస్తున్నాడని తెలిపారు. ఈ విషయంపై వారి తల్లిదండ్రులు పాఠశాల యజమాన్యానికి పలుమార్లు ఫిర్యాదు చేసిన పట్టించుకోకపోవడంతో... సంతోష్‌నగర్ పోలీసులను ఆశ్రయించారు. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు రిజ్వాన్ అహ్మద్‌ను అరెస్టు చేశారు.
ఇవీ చదవండి: