ఒక్కసారిగా ఉలిక్కిపడింది.ఒకే ఇంట్లో ఆరుహత్యలు. వాళ్లలో ఇద్దరు చిన్నారులు. ఇళ్లంతా రక్తపుమడుగు.. చెల్లాచెదురుగా పడి ఉన్న మృతదేహాలు. మెుదట ఆస్తితగాదాలే అనుకున్నారంతా.. కానీ లోతుగా వివరాలు ఆరా తీస్తే.. ఈ ఆరుహత్యలకు కారణం.. గతంలో జరిగిన అత్యాచారమే అని తెలుస్తోంది.
ఆంధ్రప్రదేశ్లోని విశాఖ జిల్లా పెందుర్తి మండలం జుత్తాడలో తెల్లవారుజామున ఓ ఇంట్లోంచి ఒక్కసారిగా కేకలు. చూస్తూ ఉండగానే ఇల్లంతా రక్తపు మడుగు. చిన్నపిల్లలు, ఆడవాళ్లు అని కూడా చూడకుండా ఏకంగా ఆరుగురిని హత్య చేశాడు బత్తిన అప్పలరాజు. బొమ్మిడి రమణ (63), బొమ్మిడి ఉషారాణి (35), అల్లు రమాదేవి (53), నక్కెళ్ల అరుణ (37), ఉషారాణి పిల్లలు బొమ్మిడి ఉదయ్ (2), బొమ్మిడి ఉర్విష (6 నెలలు) అంతా రక్తపు మడుగుల్లో ప్రాణాలు వదిలారు. ఒక్కసారిగా విషయం తెలిసిన జుత్తాడ గ్రామం ఉలిక్కిపడింది.
అయితే ఈ హత్యలు పాత కక్షల నేపథ్యంలో జరిగాయి అనుకున్నారంతా. నిందితుడు పెందుర్తి పోలీస్ స్టేషన్కు వెళ్లి లొంగిపోయాడు. మెుదట విచారణ చేస్తుంటే.. అసలు విషయం తెలియలేదు. కానీ పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తుంటే షాకింగ్ నిజాలు బయటకు వచ్చాయి. ఇప్పుడే కాదు అప్పలరాజు ఓ హత్యాయత్నం కేసులో 2012లోనూ నిందితుడిగా ఉన్నాడు. 2018లోనూ పెందుర్తి పోలీస్ స్టేషన్లో మరో కేసు కూడా నమోదైంది.
అసలు కారణం ఇదే..