కరోనా ప్రారంభ దశలో...ఓ వర్గాన్ని కించపరిచేలా భయబ్రాంతులకు గురిచేసే విధంగా సామాజిక మాధ్యమాల్లో వీడియోలు పోస్ట్ చేసిన ఓ వ్యక్తిని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్ చాంద్రాయణగుట్టకు చెందిన ఫైసల్ అలియాస్ లతీఫ్ మహమ్మద్‌పై గతంలో పోలీసులు కేసు నమోదు చేశారు.
సామాజిక మాధ్యమాల్లో వివాదాస్పద పోస్టులు పెట్టిన వ్యక్తి అరెస్టు - Controversial posts in social media
కొవిడ్ ప్రారంభ దశలో ఓ వర్గాన్ని కించపరిచేలా సామాజిక మాధ్యమాల్లో వీడియోలు పోస్ట్ చేసిన వ్యక్తి హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. దుబాయ్ నుంచి హైదరాబాద్‌కు వస్తున్నాడనే సమాచారంతో శంషాబాద్ విమానాశ్రయంలో అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు.
సామాజిక మాధ్యమాల్లో వివాదాస్పద పోస్టులు పెట్టిన వ్యక్తి అరెస్టు
అప్పటి నుంచి అతడు దుబాయ్‌లో తలదాచుకున్నాడు. లుక్ అవుట్ నోటీసులు జారీ చేసిన పోలీసులు... దుబాయ్ నుంచి ఈ రోజు హైదరాబాద్‌కి వస్తున్నాడనే సమాచారంతో శంషాబాద్ విమానాశ్రయంలో అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు.
- ఇదీ చూడండి :సోషల్ మీడియాకు ఇక కొత్త నియమావళి