Clash due to tea:టీ చల్లగా ఉందని చెప్పడంతో మొదలైన గొడవ.. పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదులు ఇచ్చుకునే వరకూ వెళ్లింది. ఈ సంఘటన సంగారెడ్డి జిల్లా పటాన్చెరులో చోటుచేసుకుంది. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. పటాన్‌చెరు శివారు బాహ్యవలయ రహదారి కూడలిలో ఉన్న ఓ హోటల్‌లో పోచారం గ్రామస్థులు టీ తాగేందుకు వెళ్లారు. హోటల్ సిబ్బంది ఇచ్చిన టీ చల్లగా ఉండటంతో వారితో వాగ్వాదానికి దిగారు.
టీ చల్లగా ఉందని గొడవ.. చివరకు పోలీస్ స్టేషన్లో.. - టీ గొడవ
Clash due to tea: ఉదయాన్నే చాలా మంది టీ తాగుతారు. టీ చల్లగా ఉందని గ్రామస్థులు హోటల్ సిబ్బందితో ఘర్షణకు దిగిన ఘటన సంగారెడ్డి జిల్లాలో జరిగింది. టీ స్టాల్లో మొదలైన గొడవ చివరికి ఎక్కడి వరకు వెళ్లిందంటే..
టీ వలన గొడవ పడిన వ్యక్తులు
చినికి చినికి గాలి వానైనట్లు టీ కోసం మొదలైన చిన్న గొడవ ఘర్షణకు దారి తీసింది. ఈ గొడవలో హోటల్ అద్దాలు ధ్వంసమయ్యాయి. హోటల్లోని సామగ్రి అంతా చెల్లాచెదురైంది. గొడవ పడింది సరిపోక.. ఇరు వర్గాల వారు పోలీస్ స్టేషన్ను ఆశ్రయించారు. ఒకరిపై మరొకరు పటాన్‌చెరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇవీ చదవండి: