సంగారెడ్డి జిల్లా కంది మండలంలో విషాదం చోటుచేసుకుంది. ఈత సరదా.. ఓ యువకుడి ప్రాణం తీసింది. ఎరుకలి కృష్ణ.. స్నేహితులతో కలిసి సరదాగా గడపడానికి స్థానిక మామిడిపల్లి చెరువు వద్దకు వెళ్లాడు. మిత్రులతో కలిసి నీటిలోకి దిగాడు. ఈత కొడుతూ ఇంకాస్త లోపలికి వెళ్లాడు. లోతు ఎక్కువుందని గ్రహించేలోపే నీట మునిగి గల్లంతయ్యాడు.
విషాదం: యువకుడి ప్రాణం తీసిన ఈత సరదా
వేసవిలో.. యువకులు కాసేపటి ఉపశమనం కోసం ఈత వైపు అడుగులు వేస్తున్నారు. సరదాగా వెళ్లి.. మృత్యు సుడిగుండాల్లో పడి ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. రాష్ట్రంలో నిత్యం ఏదో చోట జరుగుతూనే ఉన్న ఈ ప్రమాదాలు.. ప్రస్తుతం ఆందోళన కలిగిస్తున్నాయి. నదులు, చెరువులు, కుంటలు.. ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి. సంగారెడ్డి జిల్లా కంది మండలంలో ఇలాగే ఓ యువకుడి నిండు ప్రాణం.. ఈత సరదాకు బలైంది.
ఈతకు వెళ్లి మృతి
తోటివారి సమాచారంతో కుటుంబసభ్యులు, పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకున్నారు. గాలింపు చేపట్టి.. యువకుడి మృతదేహాన్ని బయటకు తీశారు. విగత జీవిగా పడి ఉన్న కుమారుడిని చూసి.. తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. పోస్టుమార్టం నిమిత్తం.. మృతదేహాన్ని జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
ఇదీ చదవండి:రెండు టన్నుల చేపలు మృత్యువాత