తెలంగాణ

telangana

ETV Bharat / crime

two groups attack: గుండ్ల సింగారంలో తీవ్ర ఉద్రిక్తత.. ఇరువర్గాలు కర్రలతో దాడి - కర్రలతో దాడి

two groups attack: హనుమకొండ జిల్లాలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. పరస్పరం ఇరువర్గాలు కర్రలతో దాడి చేసుకున్నారు. ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. సీపీఐ ఆధ్వర్యంలో ప్రభుత్వ భూమిలో నిరుపేదలు గుడిసెలు వేయడంతో వివాదం తలెత్తింది.

two groups attack
గుండ్ల సింగారంలో తీవ్ర ఉద్రిక్తత

By

Published : Jun 21, 2022, 3:54 PM IST

two groups attack: హనుమకొండ జిల్లా కేంద్రంలోని హనుమకొండ మండలం గుండ్ల సింగారంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. సీపీఐ ఆధ్వర్యంలో ప్రభుత్వ భూమిలో నిరుపేదలు గుడిసెలు వేసుకున్నారు. ఆయితే స్థానికులు వీరిని అడ్డుకున్నారు. పేదలు వేసుకున్న గుడిసెలను స్థానికులు తొలగించారు. ఈక్రమంలో స్థానికులకు, గుడిసెవాసులకు తీవ్ర తోపులాట, వాగ్వాదం చోటు చేసుకుంది.

దీంతో ఒకరిపై ఒకరు కర్రలతో దాడి చేసుకున్నారు. మా భూములలో గుడిసెలు వేసుకుంటున్నారని స్థానికులు ఆరోపించారు. అది ప్రభుత్వ భూమి కాదని అన్నారు. గుడిసెలు ఉన్న స్థలాలకు రాకుండా స్థానికులు అడ్డుకున్నారు. ఈదాడిలో పలువురికి గాయాలయ్యాయి. ఉద్రిక్తత చోటు చేసుకోవడంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. పేదలు గుడిసెలకు వెళ్లే రోడ్డుకు అడ్డంగా స్థానికులు ముళ్లకంపలు వేశారు.

గుండ్ల సింగారంలో తీవ్ర ఉద్రిక్తత.. ఇరువర్గాలు కర్రలతో దాడి

ABOUT THE AUTHOR

...view details