మహబూబాబాద్ జిల్లా నుంచి హైదరాబాద్కు అక్రమంగా తరలిస్తున్న 40 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. డోర్నకల్ మండలం పెరుమాండ్ల సంకీస వద్ద నిర్వహించిన తనిఖీల్లో పీడీఎస్ బియ్యాన్ని గుర్తించారు. అక్రమ రవాణాకు పాల్పడుతున్న ఐదుగురిపై కేసు నమోదు చేసి... ముగ్గురిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ శ్రీనివాస్ వెల్లడించారు. రెండు వాహనాలను సీజ్ చేశామని తెలిపారు.
అక్రమంగా తరలిస్తున్న 40 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత - తెలంగాణ వార్తలు
మహబూబాబాద్ జిల్లా నుంచి హైదరాబాద్కు అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని పోలీసులు సీజ్ చేశారు. ఐదుగురిపై కేసు నమోదు చేసి ముగ్గురిని అరెస్ట్ చేశారు. అక్రమ వ్యాపారాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని సీఐ శ్రీనివాస్ హెచ్చరించారు.
పీడీఎస్ బియ్యం పట్టివేత, రేషన్ బియ్యం పట్టివేత
ఖమ్మంకు చెందిన ఎస్‌కే నన్నేమియా, మోహన్ కృష్ణ, హైదరాబాద్కు చెందిన చాంద్‌పాషాను అరెస్టు చేయగా మరో ఇద్దరు పరారీలో ఉన్నట్లు తెలిపారు. అక్రమ వ్యాపారాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని సీఐ హెచ్చరించారు.