మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కీసర నుంచి గుజరాత్‌కు అక్రమంగా తరలిస్తున్న పీడీఎస్ బియ్యాన్ని సీజ్ చేసినట్లు పోలీసులు తెలిపారు. దాదాపు 290 క్వింటాళ్ల బియ్యం స్వాధీనం చేసుకొని... ఎనిమిది మందిని అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు.
290 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్.. 8మంది అరెస్ట్! - తెలంగాణ లేటెస్ట్ అప్డేట్స్
కీసర పోలీసు స్టేషన్ పరిధిలో భారీ మొత్తంలో పీడీఎస్ బియ్యాన్ని సీజ్ చేసినట్లు పోలీసులు తెలిపారు. ఎనిమిది మంది నిందితులను అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. కీసర నుంచి గుజరాత్‌కు ఈ బియ్యాన్ని తరలిస్తున్నట్లు పేర్కొన్నారు.
290 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్.. 8మంది అరెస్ట్!
రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్నారనే సమాచారంతో తనిఖీలు చేపట్టామని చెప్పారు. ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలో రెండు వాహనాలను సీజ్ చేసినట్లు కీసర సీఐ నరేందర్ గౌడ్ పేర్కొన్నారు.
ఇదీ చదవండి:జవహర్‌నగర్‌లో వ్యక్తి అనుమానాస్పద మృతి