తెలంగాణ

telangana

ETV Bharat / crime

పవన్ పర్యటనలో అపశ్రుతి.. ఒకరు మృతి.. ముగ్గురికి గాయాలు - రోడ్డు ప్రమాదం

Pavan Kalyan Fan Died in Road Accident: జనసేన అధినేత పవన్ కల్యాణ్ జగిత్యాల పర్యటనలో అపశ్రుతి చోటుచేసుకుంది. పవన్​ను చూసేందుకు కాన్వాయ్​ను వెంబడిస్తూ బైక్​పై వెళ్తున్న యువకులు కారును ఢీకొట్టారు. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా, ముగ్గురికి గాయాలయ్యాయి.

Pavan Kalyan
Pavan Kalyan

By

Published : Jan 24, 2023, 10:49 PM IST

Pavan Kalyan Fan Died in Road Accident: జనసేన అధినేత పవన్ కల్యాణ్ పర్యటనలో అపశ్రుతి చోటుచేసుకుంది. పవన్​ను చూసేందుకు కాన్వాయ్​ను ఫాలో అయిన యువకులు రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఈ ఘటనలో ఓ యువకుడు మృతి చెందగా, మరో ముగ్గురు యువకులకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

వివరాలలోకి వెళితే.. జగిత్యాల వెల్గటూరు మండలం కిషన్‌రావుపేటవద్ద పవన్ కాన్వాయ్​ను ఫాలో అయ్యేందుకు బైకులపై యువకులు వెళ్తున్నారు. పవన్ కల్యాణ్​ను చూసేందుకు వెంబడిస్తున్న ఓ అభిమాని కారు ఢీకొట్టాడు. ఈ క్రమంలో అతడికి తీవ్ర గాయాలయి అక్కడికక్కడే మృతి చెందాడు. బైక్​లపై ఉన్న మరో ముగ్గురు యువకులకు గాయాలయ్యాయి. స్థానికులు వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details