భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ ఎంపీడీఓ ఆల్బర్ట్.. లంచం తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా అనిశాకు చిక్కాడు. శ్మశానవాటికను నిర్మించిన రామలింగయ్య అనే గుత్తేదారు.. దానికి సంబంధించిన బిల్లును విడుదల చేయాలని కోరగా.. ఎంపీడీఓ రూ.20వేలు లంచం డిమాండ్ చేశాడు. తొలుత గుత్తేదారు రూ.20వేలు చెల్లించాడు. మరో రూ.20వేలు ఇస్తేనే.. బిల్లు విడుదల చేస్తానని చెప్పగా.. గుత్తేదారు ఖమ్మంలోని ఏసీబీ అధికారులను సంప్రదించాడు.
లంచం తీసుకుంటూ పట్టుబడ్డ పాల్వంచ ఎంపీడీఓ - acb caught palwancha mpdo
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ ఎంపీడీఓ ఆల్బర్ట్.. లంచం తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా ఏసీబీకి పట్టుబడ్డాడు. శ్మశానవాటికను నిర్మించిన గుత్తేదారు.. దానికి సంబంధించి బిల్లు విడుదల చేయాలని కోరగా.. ఎంపీడీఓ లంచం డిమాండ్ చేసినట్లు ఏసీబీ డీఎస్పీ మధుసూదర్ రావు తెలిపారు.
పాల్వంచ ఎంపీడీఓ, లంచం తీసుకున్న పాల్వంచ ఎంపీడీ, ఏసీబీ వలలో పాల్వంచ ఎంపీడీఓ
రంగంలోకి దిగిన అనిశా.. ఎంపీడీఓ లంచం తీసుకుంటుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ప్రభుత్వ అధికారులు ఎవరైనా లంచం అడిగితే తమను సంప్రదించాలని ఏసీబీ డీఎస్పీ మధుసూదన్ రావు కోరారు.
- ఇదీ చదవండి :తానేమైనా.. శత్రువు కుటుంబం మిగలకూడదనే కసి!