తెలంగాణ

telangana

ETV Bharat / crime

ఖరీదైన కుక్క కనిపించడం లేదు..

మెదక్ జిల్లా తూప్రాన్‌లో అరుదైన ఘటన జరిగింది. పెంపుడు శునకం కనిపించడం లేదంటూ యజమానురాలు పోలీసులను ఆశ్రయించింది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

dog theft in toopran
చోరీకి గురైన శునకం

By

Published : Mar 25, 2021, 9:46 PM IST

ప్రత్యేక జాతికి చెందిన ఓ శునకం చోరీకి గురైన ఘటన మెదక్‌ జిల్లా తూప్రాన్‌లో జరిగింది. కుక్కను పెంచుకుంటున్న యజమానురాలి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. చోరీ విషయమై పలువురిపై అనుమానం ఉన్నట్లు ఆమె ఫిర్యాదులో తెలిపారు.

వివరాల్లోకి వెళ్తే..

వరంగల్‌కు చెందిన సహస్ర చౌదరి తూప్రాన్‌ పురపాలిక పరిధిలోని బ్రాహ్మణపల్లి శివారులో ఐదెకరాల భూమిని కొనుగోలు చేసి.. 60 శునకాలను పెంచుతోంది. వాటిలో ప్రత్యేకంగా కొనుగోలు చేసిన బ్రీడ్‌ బీగల్ జాతికి చెందిన ఓ శునకం ఈనెల 20వ తేదీ నుంచి కనిపించకుండా పోయింది. యజమాని స్థానికుల సహాయంతో చుట్టుపక్కల ప్రాంతాల్లో వెతికినా ప్రయోజనం లేకుండా పోయింది. దీంతో చేసేదేమిలేక పోలీసులను ఆశ్రయించింది. సహస్ర చౌదరి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సత్యనారాయణ వెల్లడించారు.

శునకం చోరీపై పోలీసులకు ఫిర్యాదు

ఇదీ చూడండి:'ఆక్రమణకు గురైన వక్ఫ్​బోర్డు ఆస్తులు ఎన్ని స్వాధీనం చేసుకున్నారు..?'

ABOUT THE AUTHOR

...view details