తెలంగాణ

telangana

ETV Bharat / crime

రెండు బైక్​లు ఢీ: ఒకరికి తీవ్రగాయాలు - two wheeler collision at suryapet

సూర్యాపేట జిల్లాలో రోడ్డు ప్రమాదం సంభవించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

one person was seriously injured in a two wheeler collision at suryapeta districts tungaturti mandal
రెండు బైక్​లు ఢీ: ఒకరికి తీవ్రగాయాలు

By

Published : Feb 12, 2021, 6:39 AM IST

రెండు ద్విచక్ర వాహనాలు ఢీ కొనటంతో ఒకరికి తీవ్రగాయాలైన ఘటన సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండల కేంద్రంలో చోటు చేసుకుంది. వెంపటి గ్రామానికి చెందిన చిట్టిపాక శ్రీనివాస్ తన ద్విచక్ర వాహనంపై తుంగతుర్తికి వస్తున్నాడు.

అదే సమయంలో ఎదురుగా మరో బైక్​పై వస్తున్న మెంతబోయిన మధు బైక్​ని ఢీ కొట్టాడు. ఈ ఘటనలో శ్రీనివాస్ తలకు బలంగా గాయమై తీవ్రంగా రక్తస్రావమైంది. బాధితుడిని చికిత్స నిమిత్తం సూర్యాపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నట్లు ఎస్సై శ్రీకాంత్ గౌడ్ తెలిపారు.

ఇదీ చదవండి:పవర్ ప్లాంట్​లో ప్రమాదం: ఒకరు మృతి

ABOUT THE AUTHOR

...view details