మేడ్చల్ మున్సిపాలిటీ పరిధిలోని జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఉదయం ఆరు గంటల సమయంలో డివైడర్‌పై నాటిన మొక్కలకు పారిశుద్ధ్య కార్మికులు నీళ్లు పోస్తున్నారు. ఈ క్రమంలో అతి వేగంగా తూప్రాన్ నుంచి నగరానికి రాంగ్ రూట్లో ఓ టిప్పర్ దూసుకొచ్చింది. ఆ వాహనం అదుపు తప్పి.. డివైడర్ ఎక్కి కార్మికులను ఢీకొట్టింది.
టిప్పర్ బీభత్సం.. ఒకరు మృతి, మరొకరికి తీవ్ర గాయాలు - road accident in medchal
మేడ్చల్ మున్సిపాలిటీలో టిప్పర్ బీభత్సం సృష్టించింది. మొక్కలకు నీళ్లు పోస్తున్న పారిశుద్ధ్య కార్మికులను.. అతివేగంగా వచ్చిన టిప్పర్ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఓ వ్యక్తి నుజ్జునుజ్జు అయ్యాడు.
టిప్పర్ బీభత్సం.. ఒకరు మృతి, ఇద్దరికి గాయాలు
ఈ ఘటనలో దశరథ(48) అనే వ్యక్తి అక్కడిక్కడే మృతి చెందాడు. అతని శరీరం నుజ్జునుజ్జు అయ్యింది.మరో మహిళా కార్మికురాలికితీవ్రగాయాలు కావడంతో.. ఆసుపత్రికి తరలించారు. టిప్పర్ డ్రైవర్ అక్కడి నుంచి తప్పించుకుని పారిపోయాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Last Updated : Apr 3, 2021, 11:11 AM IST