భూవివాదంలో జరిగిన దాడిలో ఒకరు మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఇరువర్గాల మధ్య గొడవ ఈ హత్యకు కారణమైంది. జగిత్యాల గ్రామీణ మండలం సంగంపల్లిలో కర్రతో దాడి చేయగా ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. గ్రామానికి చెందిన జాలపల్లి రవి, అతని భార్య మల్లవ్వపై.. అదే గ్రామానికి చెందిన పత్తిపాక బాపన్న కర్రతో దాడి చేశాడు. ఈ దాడిలో రవి అక్కడికక్కడే మృతి చెందగా ఆయన భార్య మల్లవ్వకు తీవ్ర గాయాలయ్యాయి.
భూతగాదాలో భార్య, భర్తలపై దాడి.. ఒకరి మృతి - జగిత్యాల జిల్లా వార్తలు
భూ తగాదా ఓ వ్యక్తి హత్యకు దారితీసింది. జగిత్యాల గ్రామీణ మండలం సంగంపల్లిలో భార్య, భర్తలపై కర్రతో దాడి చేయగా భర్త అక్కడికక్కడే మృతి చెందాడు.
భూతగాదాలో ఒకరి మృతి
స్థానికులు వెంటనే ఆమెను కరీంనగర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కొన్ని రోజులుగా ఇంటి దారి విషయంలోనూ ఇరువురి మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇరువురి మధ్య గొడవ జరిగింది. ఘటనపై సమాచారం అందుకున్న జగిత్యాల రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.