మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం సీతానాగారం గ్రామంలో పల్లె ప్రగతి కార్యక్రమం ప్రారంభానికి ముందు జరిగిన ప్రమాదంలో ఒకరు మృతిచెందారు. మొదటి రోజు గ్రామ సభ కోసం భూపతిపేట నుంచి గ్రామ పంచాయతీ ట్రాక్టర్‌లో కుర్చీలు,టెంట్‌లు తీసుకు వస్తుండగా ప్రమాదవశాత్తు ట్రాక్టర్ ట్రాలీ బోల్తా పడింది. ఈ ఘటనలో పంచాయతీ సిబ్బంది సాంబయ్య మృతిచెందాడు.
విషయం తెలుసుకున్న గూడూరు ఎస్ఐ సతీష్ ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గూడురు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. బంధు మిత్రుల రోదనలతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.