తెలంగాణ

telangana

ETV Bharat / crime

Uppal Accident CCTV footage: ఉప్పల్​లో టిప్పర్​ను ఓవర్​ టేక్​ చేయబోయి... - యువకుడు మృత్యువాత

Uppal Accident CCTV footage: అతివేగం నిండు ప్రాణాలను బలితీసుకుంది. టిప్పర్​ను ఓవర్​ టేక్​ చేయబోయి ఓ యువకుడు మృత్యువాత పడ్డాడు. ఈ ఘటనలో మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి.

Uppal Accident CCTV footage
ద్విచక్రవాహనం టిప్పర్‌ కింద పడి యువకుడు మృతి

By

Published : Dec 26, 2021, 7:13 PM IST

Uppal Accident CCTV footage: అతివేగం ఓ యువకుని ప్రాణాలను బలిగొంది. ద్విచక్రవాహనంపై వెళ్తూ టిప్పర్​ను ఓవర్​ టేక్ చేసే క్రమంలో అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన హైదరాబాద్​ ఉప్పల్​లోని చిలుకనగర్​లో జరిగింది. ఈ ప్రమాదంలో మరో యువకుడికి గాయాలయ్యాయి. క్షతగాత్రున్ని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో నిక్షిప్తమయ్యాయి. మృతుడు నాచారం అన్నపూర్ణ కాలనీకి చెందిన విశాల్ సింగ్(25)గా పోలీసులు గుర్తించారు.

ప్రమాదం జరిగిందిలా...

విశాల్ సింగ్(25) మరో యువకుడుతో కలిసి పని నిమిత్తం ఉప్పల్​కు ద్విచక్రవాహనంపై బయలుదేరారు. చిలుక నగర్ వద్దకు రాగానే వాహనం నడుపుతున్న విశాల్ సింగ్ ముందు వెళ్తున్న టిప్పర్​ను ఓవర్ టేక్ చేసే క్రమంలో అదుపు తప్పి వెనుక చక్రాల కింద పడిపోయాడు. ఈ ప్రమాదంలో విశాల్ సింగ్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు అతివేగమే ప్రమాదానికి కారణమని భావిస్తున్నారు.

సీసీ కెమెరాలో రికార్డయిన ప్రమాదం దృశ్యాలు

ABOUT THE AUTHOR

...view details