తెలంగాణ

telangana

ETV Bharat / crime

shamshabad: ఎయిర్​పోర్టులో డ్రైనేజీ పైప్​లైన్​ బాగుచేస్తూ ఒకరు మృతి - డ్రైనేజీ పైప్​లైన్​ లీకేజీ

శంషాబాద్​ ఎయిప్​పోర్టులో డ్రైనేజీ పైప్​లైన్​ లీకేజీ ఘటన ఒకరిని పొట్టనబెట్టుకుంది. విమానాశ్రయంలో ఏర్పడిన డ్రైనేజీ పైప్​లైన్​ లీకేజీని సరిచేసేందుకు వచ్చిన ముగ్గురు ప్లంబర్లు అస్వస్థతకు గురయ్యారు. వారిని ఆస్పత్రికి తరలించగా.. ఒకరు మృతి చెందాడు.

one man died at shamshabad airport doing drainage repair
one man died at shamshabad airport doing drainage repair

By

Published : Jun 18, 2021, 4:54 AM IST

Updated : Jun 18, 2021, 9:50 AM IST

శంషాబాద్ విమానాశ్రయంలో డ్రైనేజీ పైప్​లైన్ లీకేజీ సరిచేస్తుండగా ఓ వ్యక్తి మృతిచెందాడు. విమానాశ్రయంలోని డ్రైనేజీ పైపులైన్ సరిగ్గా పనిచేయకపోవటం వల్ల దాన్ని బాగు చేసేందుకు ముగ్గురు ప్లంబర్లు వచ్చారు. పైపులైన్​ను సరిచేసేందుకు అందులో యాసిడ్ పోశారు.

ఒక్కసారిగా ఘాటైన వాసన రావడం వల్ల... రిపేరు చేస్తున్న నరసింహారెడ్డి (42)తో పాటు మరో ఇద్దరు సృహతప్పిపడిపోయారు. వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించగా... అందులో నరసింహారెడ్డి మృతిచెందాడు. నరసింహారెడ్డి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించినట్లు శంషాబాద్ డీసీపీ ప్రకాష్ రెడ్డి తెలిపారు.

ఇదీ చూడండి: ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.. ఒకరిని కాదు ఇద్దరినీ..

Last Updated : Jun 18, 2021, 9:50 AM IST

ABOUT THE AUTHOR

...view details