జోగులాంబ గద్వాల జిల్లా ఐజా మండలం వెంకటాపురం సమీపంలో రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. ఆటో-కారు ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో ఓ యువకుడు మృతి చెందగా.. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.
ఆటో-కారు ఢీ.. ఒకరు మృతి, మరో ముగ్గురికి తీవ్ర గాయాలు - gadwal district latest news
ఆటో-కారు ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో ఓ యువకుడు మృతి చెందగా.. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన జోగులాంబ గద్వాల జిల్లాలో చోటుచేసుకుంది.
ఐజా నుంచి వస్తున్న ఆటో శాంతినగర్ నుంచి ఐజా వైపు వెళ్తున్న కారు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ప్రమాదంలో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు క్షతగాత్రులను కర్నూల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా.. వడ్డేపల్లి మండలం తనగల గ్రామానికి చెందిన శ్రీనివాస్‌రెడ్డి అనే యువకుడు మార్గమధ్యలో మృతి చెందాడు. మిగతా వారి పరిస్థితీ విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చూడండి: లక్షల్లో లాభాలు చూపిస్తూ.. ఖాతాలో సొమ్ము కాజేస్తూ..