తెలంగాణ

telangana

ETV Bharat / crime

డివైడర్​ను ఢీకొట్టిన కారు.. ఒకరు మృతి, మరొకరికి తీవ్ర గాయాలు - telangana latest news

ఓ కారు అతివేగంతో డివైడర్​ను ఢీకొట్టి బోల్తాపడింది. ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా.. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు.

accident at Langer House
డివైడర్​ను ఢీకొట్టిన కారు

By

Published : Apr 8, 2021, 10:16 AM IST

లంగర్​హౌస్ పోలీస్​స్టేషన్ పరిధిలో బుధవారం అర్ధరాత్రి రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. పిల్లర్ నెంబర్ 103 వద్ద ఓ కారు డివైడర్​ను ఢీకొట్టి బోల్తాపడింది. ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా.. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి.

గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. రాజేంద్రనగర్​ నుంచి మెహిదీపట్నం వైపు వెళ్తుండగా ప్రమాదం జరిగినట్లు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చూడండి: యజమాని కోసం శునకం మౌనరోదన..

ABOUT THE AUTHOR

...view details