CC footage: మద్యం సేవించి డ్రైవింగ్... బాలుడు మృతి మద్యం తాగి వాహనాలు నడుపుతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. పీకల దాకా మద్యం తాగి.. అదే మత్తులో బండిని రోడ్కడెక్కిస్తున్నారు. రోడ్లపై ట్రాఫిక్ పోలీసులు డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు చేసి కఠిన చర్యలు తీసుకుంటున్నా.. డోంట్‌కేర్ అంటున్నారు. ఓ వ్యక్తి మద్యం సేవించి.. ద్విచక్రవాహనంపై బాలుడిని ఎక్కించుకుని ప్రయాణం చేశాడు. ఈ క్రమంలో డీసీఎం ఢీకొట్టింది. ఈ ఘటనలో బాలుడు తీవ్రగాయలుకాగా... చికిత్స పొందుతూ మృతి చెందాడు.
ఇదీ జరిగింది...
డి.పోచంపల్లి చంద్రశేఖర్ రెడ్డినగర్‌కు చెందిన జాకీరుస్సేన్, రేష్మ దంపతుల కుమారుడు అల్పాఫ్ హుస్సేన్. వయసు 13ఏళ్లు. స్వాతంత్ర్య దినోత్సవం రోజున చికెన్ కోసం.. స్థానిక యువకుడు ఇర్ఫాన్‌తో కలిసి ద్విచక్రవాహనంపై గండిమైసమ్మ చౌరస్తాకు బయలుదేరాడు. మేడ్చల్‌వైపు నుంచి వచ్చిన డీసీఎం ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టింది. బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. వాహనాన్ని నడుపుతున్న యువకుడికి స్వల్పగాయలయ్యాయి. స్థానికులు హుటాహుటిన వారిని ఆసుపత్రికి తీసుకెళ్లారు.
బాలుడు అల్తాఫ్ హుస్సేన్‌ను కూకట్‌పల్లిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా... చికిత్స పొందతూ సోమవారం మృతి చెందాడు. ప్రమాదం జరిగిన సమయంలో ద్విచక్రవాహనం నడుపుతున్న ఇర్ఫాన్ మద్యం సేవించినట్లు పోలీసులు గుర్తించారు. పరీక్షించగా 38 రీడింగ్ వచ్చింది. మద్యం సేవించి ద్విచక్రవాహనం నడిపిన యువకుడిపై 302 పార్ట్-2 సెక్షన్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదం జరిగిన ఘటన దృశ్యాలు సీసీటివిలో నమోదయ్యాయి.