రంగారెడ్డి జిల్లా కొత్తపల్లి వాగులో గల్లంతయిన(Car washed away) వెంకటయ్య మృతదేహం లభించింది. చేవెళ్ల మండలం ఎంకేపల్లి వాగులో పోలీసులు కారును గుర్తించారు. ఘటన జరిగిన సమయంలో కారులో ఐదుగురు ఉండగా... వాగు ఉద్ధృతి చూసి ముగ్గురు తప్పించుకున్నారు. కారు కొద్దీ దూరం కొట్టుకుపోయాక మరొకరు చెట్టును పట్టుకొని గ్రామస్థుల సహకారంతో బయటపడ్డారు. వెంకటయ్య మాత్రం కారుతో పాటు కొట్టుకుపోయారు.
Car washed away: ఎంకేపల్లి వాగులో వృద్ధుడి మృతదేహం లభ్యం - తెలంగాణ వార్తలు
రంగారెడ్డి జిల్లా కొత్తపల్లి వాగులో కారు గల్లంతయిన(Car washed away) ఘటనలో వృద్ధుడు మృతి చెందారు. చేవెళ్ల మండలం ఎంకేపల్లి వాగులో ఆయన మృతదేహం లభించింది. ఈ ప్రమాదం నుంచి నలుగురు సురక్షితంగా బయటపడ్డారు.
కారు గల్లంతు, మృతదేహం లభ్యం
కారుతో పాటు వెంకటయ్య మృతదేహాన్ని పోలీసులు ఇవాళ ఉదయం గుర్తించారు. వికారాబాద్ జిల్లా ఎంకేతల గ్రామానికి చెందిన వెంకటయ్య... కౌకుంట్ల గ్రామంలోని కూతురు ఇంటికి వచ్చి బంధువుల విందుకు హాజరై వెళ్తుండగా ఈ ఘటన జరిగింది.
ఇదీ చదవండి:వాగులో కారు గల్లంతు... వధువుతో పాటు మరో ఇద్దరి మృతదేహాలు లభ్యం