శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్లో అశ్లీల నృత్యాలు నిర్వహించిన 40 మందిపై ఏపీలోని కృష్ణా జిల్లాలో కేసు నమోదైంది. ఎస్సై షణ్ముకసాయి తెలిపిన కథనం ప్రకారం.. కృష్ణాజిల్లా కైకలూరు మండలం తామరకొల్లు గ్రామంలో రెండు రామాలయాల కమిటీల ఆధ్వర్యంలో నిర్వహించిన ఊరేగింపులో కొందరు యువకులు అశ్లీల నృత్యాలు నిర్వహించారు.
కృష్ణాష్టమి వేడుకల్లో అశ్లీల నృత్యాలు.. ఏపీలో 40 మందిపై కేసు - ap news 2021
ఏపీలోని కృష్ణాజిల్లా కైకలూరు మండలం తామరకొల్లులో కృష్ణాష్టమి వేడుకల సందర్భంగా అమ్మాయిలతో అశ్లీల నృత్యాలు చేయించారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కేసు నమోదు చేసిన పోలీసులు 40 మందిపై కేసు నమోదు చేశారు.
కృష్ణాష్టమి రోజు అశ్లీల నృత్యాలు
ఈ విషయంపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని విచారణ చేపట్టారు. ఆలయ కమిటీ సభ్యులు, ట్రాక్టర్ యజమానులు, హిజ్రాలపై కేసు నమోదు చేశామని, డీజే బాక్సులు సీజ్ చేశామని ఎస్సై తెలిపారు.
- ఇదీ చదవండి :వలలో చిక్కిన అరుదైన చేపలు.. ధర ఎంతంటే?