తెలంగాణ

telangana

ETV Bharat / crime

PARTY: పార్టీలో అశ్లీల నృత్యాలు.. వీడియోగ్రాఫర్​పై దాడి.? - చాంద్రాయణగుట్టలో అశ్లీల నృత్యాలు

హైదరాబాద్​లో ఓ రిసెప్షన్​లో అశ్లీల నృత్యాలు చేసిన సంఘటన జరిగింది. పాతబస్తీలోని చాంద్రాయణగుట్ట పీఎస్​ పరిధిలో ఓ యువకుడు నిర్వహించిన పార్టీలో ఈ యువతులపై డబ్బులు విసురుతూ నృత్యాలు చేస్తున్న వీడియో బయటపడింది.

Obscene dances at the part
పార్టీలో అశ్లీల నృత్యాలు

By

Published : Jul 1, 2021, 11:25 PM IST

పాతబస్తీలో జరిగిన ఓ రిసెప్షన్​ వేడుకలో అశ్లీల నృత్యాలు చేసిన విషయం బయటపడింది. హైదరాబాద్​లోని చాంద్రాయణగుట్ట పీఎస్​ పరిధిలోని ఓ యువకుడు నిర్వహించిన పార్టీలో ఈ సంఘటన చోటు చేసుకుంది. గతనెల 28, 29 తేదీల్లో అర్ధరాత్రి నజీర్​ అనే యువకుడు స్థానిక వలి ఫంక్షన్​హాల్​లో వేడుక నిర్వహించినట్లు పోలీసులు గుర్తించారు. అర్ధరాత్రి జరిగిన వేడుకలో యువతులపై డబ్బులు విసురుతూ నృత్యం చేస్తున్న వీడియోలు వైరల్ అవుతున్నాయి.

వీడియో బయటకు పంపించాడని ఫోటోగ్రాఫర్​పై​ దాడి.!

అదే రోజు రాత్రి సాదిక్​ అనే ఫొటోగ్రాఫర్​పై ముగ్గురు యువకులు దాడి చేసినట్లు ఫిర్యాదు అందినట్లు పోలీసులు తెలిపారు. పార్టీకి సంబంధించిన వీడియోలు బయటకు పంపించాడనే అనుమానంతో దాడి చేసి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సాదిక్​ ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

పోలీసులు చర్యలు ఫలించడం లేదు

పోలీసులు కట్టుదిట్టంగా వ్యవహరిస్తున్న ఇలాంటి ఘటనలు పునరావృతం అవుతున్నాయి. ముఖ్యంగా పాతబస్తీలోని పలు ఫంక్షన్​హాల్స్​ అశ్లీల నృత్యాలకు వేదికలుగా మారుతున్నాయి. అర్ధరాత్రి వేళల్లో మద్యం తాగి చిందులు వేస్తూ ఇలాంటి కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. వేడుకల పేరుతో అసాంఘిక శక్తులు రెచ్చిపోతున్నాయి.

గతంలోనూ ఇలాంటి సంఘటనలు

గతంలో ఏప్రిల్​ నెలలో హైదరాబాద్‌ పాతబస్తీలోని బండ్లగూడలో ఓ ఫామ్‌హౌస్ ప్రారంభోత్సవ పార్టీలో చేసిన అశ్లీల నృత్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. మజ్లీస్​ పార్టీకి చెందిన నాయకుడు ఇచ్చిన విందులో మహిళలు అశ్లీల నృత్యాలు చేశారు. ఫిబ్రవరి 13న లేక్ వ్యూ హిల్స్​లో ఉన్న ఇంపీరియల్ ఫామ్​హౌజ్​ ప్రారంభం సందర్భంగా... యజమాని ఫర్వేజ్​ తన స్నేహితులకు విందు ఏర్పాటు చేశాడు. ఈ విందులో ఫర్వేజ్​... తన స్నేహితులను ఆనందపర్చడానికి పలువురు మహిళలకు డబ్బులిచ్చి నృత్యాలు చేయించారు.

ఇదీ చూడండి:Dog kidnap: నిజామాబాద్​లో కుక్క అపహరణ.. పీఎస్​లో ఫిర్యాదు

పాతబస్తీలో అశ్లీల నృత్యాలు... వైరలవుతున్న వీడియోలు

ABOUT THE AUTHOR

...view details