తెలంగాణ

telangana

ETV Bharat / crime

ఐపీఎస్‌ అధికారిణికి మెసేజ్‌లు.. అమెరికా నుంచి వచ్చి అరెస్ట్‌

సామాజిక మాధ్యమాల్లో మొదలైన పరిచయం ఖండాంతరాలను దాటించింది. అమెరికాలో ఉంటున్న ఓ ట్రక్ డ్రైవర్.. ఇండియాలోని ఓ ఐపీఎస్ అధికారిణికి కొన్నిరోజులుగా సోషల్ మీడియాలో మెసేజ్‌లు పంపుతున్నాడు. దానికి ఆమె స్పందించకపోయినా ప్రతి నిమిషం ఆమె కదలికలను సామాజిక మాధ్యమాల ద్వారా గమనిస్తున్నాడు. అలా ఆమె కోసం అమెరికా నుంచి భారత్‌కు వచ్చి చివరకు జైలుకు వెళ్లాడు.

Social Media Crimes
Social Media Crimes

By

Published : May 11, 2022, 10:27 AM IST

అమెరికాలో ఉంటున్న ఓ ట్రక్‌ డ్రైవర్‌ ఓ ఐపీఎస్‌ అధికారిణికి సంక్షిప్త సందేశాలు పంపి.. ఆమెను కలిసేందుకు వచ్చి.. హైదరాబాద్‌ పోలీసులకు చిక్కాడు. జూబ్లీహిల్స్‌ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పంజాబ్‌ రాష్ట్రం అమృత్‌సర్‌ సమీపంలోని తర్న్‌తరన్‌ ప్రాంతానికి చెందిన మల్‌రాజ్‌ సింగ్‌ అలౌక్‌(29) కాలిఫోర్నియాలో ట్రక్‌ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. అతనికి గ్రీన్‌కార్డు సైతం ఉంది. పంజాబ్‌ క్యాడర్‌కు చెందిన ఓ మహిళా ఐపీఎస్‌ అధికారిణికి అతను కొన్నాళ్లుగా సామాజిక మాధ్యమాల్లో సంక్షిప్త సందేశాలు పంపుతున్నాడు.

ఇదీ చదవండి :Orphan girl: చిట్టితల్లికి పుట్టెడు కష్టం..మూడేళ్లలోనే తల్లిదండ్రులను కోల్పోయి..

ఆమె జనవరి 17 నుంచి ఏప్రిల్‌ 29 వరకు జూబ్లీహిల్స్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రం (ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీ)లో నిర్వహించిన శిక్షణ కార్యక్రమానికి హాజరయ్యారు. అందులోని ఓ అతిథి గృహంలో ఉంటున్నారు. మల్‌రాజ్‌సింగ్‌ అలౌక్‌ ఆమెకోసం అమెరికా నుంచి నేరుగా పంజాబ్‌ వచ్చాడు. హైదరాబాద్‌లో శిక్షణలో ఉన్నట్లు తెలుసుకొని నేరుగా ఇక్కడికి వచ్చాడు.

ఈనెల 1న ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీకి వెళ్లి వివరాలు తెలుసుకొని అధికారిణి ఉంటున్న అతిథిగృహం వద్దకు వెళ్లాడు. అలౌక్‌తో మాట్లాడటానికి ఆమె నిరాకరించి ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీ ఉన్నతాధికారులకు విషయాన్ని తెలిపారు. వారు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. సోమవారం నిందితుడిని అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు.

ABOUT THE AUTHOR

...view details