పై అధికారుల వేధింపులు తాళలేక నవ వరుడు రైలు కిందపడి బలవన్మరణానికి పాల్పడిన ఘటన ఖమ్మం జిల్లాలో (Groom Suicide) చోటుచేసుకుంది. ఖమ్మం జిల్లా తల్లాడ మండలం కలకోడిమా గ్రామానికి చెందిన ఆదూరి సన్నీ... మధిర మండల కేంద్రంలోని స్పందన మైక్రో ఫైనాన్స్ సంస్థలో ఉద్యోగం చేస్తున్నాడు. ఆర్థిక లావాదేవీల విషయంలో సంస్థ పై అధికారులు తోటి సిబ్బంది అతని వేధింపులు గురిచేశారు. అందుకు మనస్తాపం చెందిన సన్నీ శనివారం సాయంత్రం ఖమ్మం జిల్లా కేంద్రంలో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు.
Groom Suicide: 'కొత్తగా పెళ్లైనా రోజుకు 18 గంటల పని... మూడు నెలల జీతం ఆపేసి'
ఖమ్మం జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. కొత్తగా పెళ్లైన ఓ యువకుడు రైలు కింద పడి ఆత్మహత్య (Groom Suicide) చేసుకున్నాడు. వివాహం జరిగిన నెల రోజులకే సూసైడ్ చేసుకోవడం ఆ కుటుంబంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.
మృతుడికి ఖమ్మం నగరం బల్లేపల్లికి చెందిన యువతితో నెల రోజుల కిందట వివాహమైంది. ఇంతలోనే కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. మృతదేహాన్ని ఖమ్మం జిల్లా ఆసుపత్రి (Groom Suicide) మార్చరీకి తరలించారు. బంధువులు భారీ సంఖ్యలో మార్చురీ వద్దకు తరలివచ్చారు. కుటుంబ సభ్యుల రోదనలతో విషాదఛాయలు అలుముకున్నాయి. కొత్తగా పెళ్లైనా రోజుకు 18 గంటల వరకు పని చేయించుకున్నారని... మూడు నెలల జీతం నిలిపివేశారని తన ఆత్మహత్యకు కారణాలు తెలియజేస్తూ మృతుడు వాట్సాప్ మెసేజ్ పెట్టాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
ఇదీ చదవండి:లాటరీ టికెట్ కొని మర్చిపోయిన మెకానిక్.. కొద్దిరోజులకు కోటీశ్వరుడై...