పురాతనమైన శివాలయంలో నంది విగ్రహం చోరీకి గురైన సంఘటన యాదాద్రి భువనగిరి జిల్లాలో జరిగింది. గుండాల మండలం పెద్దపడిశాల గ్రామంలో గుర్తు తెలియని వ్యక్తులు విగ్రహాన్ని అహపరించారు.
పురాతన ఆలయంలో నంది విగ్రహం చోరీ - యాదాద్రి భువనగిరి జిల్లా వార్తలు
అతిపురాతన ఆలయంలో నంది విగ్రహం చోరీకి గురైంది. ఈ సంఘటన యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం పెద్దపడిశాల గ్రామంలో చోటు చేసుకుంది.
పురాతన ఆలయంలో నంది విగ్రహం చోరీ
నిత్యం దీపారాధన జరిగే శివాలయంలో శుక్రవారం రాత్రి సమయంలో దుండగులు విగ్రహాన్ని దొంగిలించినట్లు గ్రామస్థులు తెలిపారు. గతంలోనూ ఇదే మండలంలోని పలు గ్రామాల్లో ఇలాంటి చోరీలు జరిగాయని అంటున్నారు. గుండాలలో ఇలా జరగడం మొదటిసారని అన్నారు. మన నాగరికతను తెలిపే పురాతన ఆలయ సంపదను కాపాడాలని గ్రామస్థులు అధికారులను కోరుతున్నారు.