Attack on Old couple: వికారాబాద్ జిల్లా పులిమామిడి గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. భూవివాదంలో తలెత్తిన గొడవలో వృద్ధదంపతులపై విచక్షణారహితంగా దాడిచేశారు. పొలం విషయంలో... గ్రామానికి చెందిన తెలుగు యాదయ్య, రామకృష్ణారెడ్డి కుటుంబాల మధ్య వివాదం నెలకొంది.
ఈ క్రమంలో మరోసారి తలెత్తిన గొడవలో... వృద్ధులైన యాదయ్య దంపతులపై రామకృష్ణారెడ్డి కుటుంబసభ్యులు దాడిచేశారు. ఈ ఘటనలో యాదయ్య, ఆయన భార్య తీవ్రంగా గాయపడ్డారు. అపస్మారక స్థితిలో ఉన్న బాధితులను గ్రామస్థులు... వికారాబాద్ ఆస్పత్రికి తరలించారు. పొలం అమ్మాలంటూ ఎంపీటీసీ భర్త రామకృష్ణారెడ్డి దౌర్జనం చేస్తున్నారని... ఈ క్రమంలోనే వృద్ధులపై దాడిచేసినట్లు బాధిత కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేసింది. రామకృష్ణారెడ్డి నుంచి మా కుటుంబానికి ప్రాణహాని ఉందని ఫిర్యాదులో తెలిపారు. దాడికి సంబంధించిన సీసీ కెమెరా దృశ్యాలను పోలీసులకు అందించారు. గతంలోనూ ఎంపీటీసీ భర్త రామకృష్ణారెడ్డి దాడి చేశారని బాధితులు ఆరోపించారు.