తెలంగాణ

telangana

ETV Bharat / crime

తమ ఏకాంతానికి అడ్డొస్తున్నాడని, బాలుడిపై తల్లి, ఆమె ప్రియుడి కిరాతకం

Mother killed her son with lover in Nizamabad వావివరసలు మరచి వివాహేతర సంబంధం ఏర్పరచుకున్నారు. తమ ఏకాంతానికి భంగం కలిగిస్తున్నాడనే కోపంతో మూడేళ్ల బిడ్డను బలి తీసుకున్నారు. ప్రమాదమంటూ నాటకమాడారు. పోలీసులకు అనుమానం వచ్చి దర్యాప్తు చేయడంతో 50 రోజుల తర్వాత గుట్టు రట్టయింది. ఇంతటి దారుణానికి తెగబడిన నిందితులను ముషీరాబాద్‌ పోలీసులు సోమవారం అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.

Mother killed her son with lover in Nizamabad
Mother killed her son with lover in Nizamabad

By

Published : Aug 30, 2022, 8:23 AM IST

Mother killed her son with lover help in Nizamabad : నిజామాబాద్‌ జిల్లా డిచ్‌పల్లికి చెందిన దంపతులు ఉపాధి కోసం నగరానికి వచ్చారు. కొంతకాలంగా రాంనగర్‌ ప్రాంతంలో నివాసం ఉంటున్నారు. వీరికి 5, 3 సంవత్సరాల వయసున్న ఇద్దరు కుమారులు ఉన్నారు. పెద్ద కుమారుడు పాఠశాలకు వెళ్తుండగా, చిన్న కొడుకు సమీపంలోని అంగన్‌వాడీ కేంద్రానికి వెళ్తున్నాడు. ఇటీవల భార్యాభర్తలు సొంతూరులో బంధువు అంత్యక్రియలకు వెళ్లారు. ఆ కార్యక్రమానికి వచ్చిన సమీప బంధువు వారితో మాట కలిపాడు. ఆమె ఫోన్‌ నంబరు తీసుకున్నాడు.

Mother killed her son in Nizamabad : కొన్ని రోజుల తర్వాత ఉపాధి కోసం నగరానికి వస్తున్నట్లు చెప్పి రాంనగర్‌లోని దంపతుల వద్దకు మకాం మార్చాడు. భార్యతో అతను సన్నిహితంగా మెలుగుతున్నప్పటికీ.. ఆమెకు అతను సోదరుడి వరసవడంతో భర్త అనుమానించలేదు. భర్త బయటకు వెళ్లగానే ఇద్దరూ కలుసుకునే వారు. చిన్న కుమారుడు మధ్యాహ్నం అంగన్‌వాడీ కేంద్రం నుంచి ఇంటికి వస్తుండటాన్ని భరించలేకపోయారు. తమ ఏకాంతానికి అడ్డుగా ఉన్నాడనే భావనతో కోపం పెంచుకున్నారు.

ఆ రోజు ఏం జరిగింది..గత నెల 8న ఉదయం బాలుడు(3) అంగన్‌వాడీ కేంద్రానికి వెళ్లి మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఇంటికొచ్చాడు. తర్వాత కాసేపటికే తల్లి ఇంట్లోకి వచ్చింది. బిడ్డ ఆడుకుంటూ కుర్చీ పైనుంచి కింద పడ్డాడంటూ 108 వాహనంలో కుమారుడిని గాంధీ ఆసుపత్రికి తరలించింది. అక్కడ చికిత్స పొందుతూ బాలుడు మరణించాడు. బాలుడి మృతిపై తండ్రి ముషీరాబాద్‌ పోలీసులకు ఫిర్యాదు చేయగా..వారు కేసు నమోదు చేశారు.

చుట్టుపక్కల వారిని ఆరా తీయడంతో..పోలీసులు దర్యాప్తులో భాగంగా చుట్టుపక్కల వారిని విచారించగా, బాలుని మృతిపై కొందరు అనుమానం వ్యక్తంచేసినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో నిందితులను అదుపులోకి తీసుకుని ప్రశ్నించడంతో దారుణం వెలుగులోకి వచ్చింది. ‘తమ బంధానికి అడ్డుగా ఉన్నాడనే కోపంతో ఉన్న అతను బాలుడిని అడ్డు తొలగించుకోవాలని పథకం వేశాడు. దానికి ఆమె కూడా సహకరించింది.

ఆ ప్రకారం పనికి వెళ్లింది. మధ్యాహ్నం తర్వాత బాలుడు ఇంట్లో ఒంటరిగా ఉంటాడని తెలిసిన అతను ఇంట్లోకి వెళ్లి బాలుడిపై దాడిచేశాడు. బలమైన వస్తువును మల ద్వారంలో దూర్చాడు. పదేపదే కొడుతూ చిత్రహింసలకు గురిచేశాడు. తీవ్రంగా గాయపడిన బాలుడు మూడుసార్లు విరేచనాలయ్యాక అపస్మారక స్థితికి చేరగా, తర్వాత ఇద్దరూ కలిసి బిడ్డను ఆసుపత్రిలో చేర్పించారు’అని పోలీసులు దర్యాప్తులో తెలుసుకున్నట్టు సమాచారం. కేసుపై మరింత స్పష్టత వచ్చాక పూర్తి వివరాలను మీడియాకు వెల్లడిస్తామని పోలీసు అధికారులు చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details