తెలంగాణ

telangana

ETV Bharat / crime

వంట చేస్తుండగా అగ్నిప్రమాదం..తల్లీకూతుళ్ల సజీవదహనం - telangana varthalu

వంట చేస్తుండగా ప్రమాదవశాత్తు చీరకొంగుకు మంటలంటుకుని తల్లితో పాటు కూతురు కూడా మృతి చెందిన విషాద ఘటన మెదక్​ పట్టణంలో జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

మంటల్లో కాలి తల్లీకూతుళ్లు సజీవదహనం
మంటల్లో కాలి తల్లీకూతుళ్లు సజీవదహనం

By

Published : Mar 4, 2021, 4:12 PM IST

మంటల్లో కాలి తల్లీకూతుళ్లు మృతి చెందిన ఘటన మెదక్ పట్టణంలోని అజంపుర కాలనీలో చోటుచేసుకుంది. మెదక్ మండలం తిమ్మానగర్ గ్రామానికి చెందిన గట్టయ్య సీఆర్​పీగా విధులు నిర్వహిస్తున్నాడు. గత కొంతకాలంగా కుటుంబంతో సహా మెదక్​లోని స్థానిక అజంపుర కాలనీలో నివాసముంటున్నాడు. రోజు మాదిరిగానే గురువారం గట్టయ్య విధి నిర్వహణకు వెళ్లగా... భార్య రేవతి ఇంట్లో వంట చేస్తున్న క్రమంలో ప్రమాదవశాత్తు చీర కొంగుకు నిప్పంటుకుంది.

రేవతితో పాటు ఆమె కూతురు ఆద్యశ్రీకి కూడా మంటలు అంటుకున్నాయి. తల్లి కూతురు ఇద్దరు మంటల్లో కాలిపోయారు. కేకలు విని చుట్టుపక్కల వారు పోలీసులకు సమాచారం అందించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. రేవతి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ వెంకటయ్య తెలిపారు.

ఇదీ చదవండి: చేతికొచ్చిన పంటకు నిప్పంటించిన దుండగులు

ABOUT THE AUTHOR

...view details