తెలంగాణ

telangana

ETV Bharat / crime

ఆసుపత్రి నుంచి... తల్లీముగ్గురు పిల్లలు అదృశ్యం..! - కృష్ణా జిల్లా తాజా వార్తలు

Mother and children missing: ఆసుపత్రిలో కాన్పు కోసం వచ్చిన ఓ బాలింత సహా తన ముగ్గురు పిల్లలు అదృశ్యమైన ఘటన ఏపీలోని కృష్ణా జిల్లా మచిలీపట్నంలో చోటుచేసుకుంది. ఈ ఘటనపై మహిళ భర్త మచిలీపట్నం పోలీస్​స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Mother and children missing
Mother and children missing

By

Published : Jun 1, 2022, 1:11 PM IST

Mother and children missing: ఏపీలోని కృష్ణా జిల్లా మచిలీపట్నం జిల్లా ఆసుపత్రి నుంచి తల్లి పిల్లలను అపహరించారు. మచిలీపట్నం జిల్లా ఆసుపత్రిలో ఓ బాలింత సహా తన ముగ్గురు పిల్లలు మంగళవారం సాయంత్రం 7 గంటల నుంచి కనిపించడం లేదని.. బాధిత కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు.. దగ్గరలోని సీసీ ఫుటేజీలను పరిశీలించగా.. గుర్తుతెలియని వ్యక్తుల కారులో వెళుతున్నట్లు గుర్తించారు.

మచిలీపట్నంలోని దేశాయిపేటకు చెందిన ఆనంద్​కు.. ఇద్దరు పిల్లలు ఉండగా మూడో కాన్పు కోసం.. అతని భార్య జిల్లా ఆసుపత్రిలో చేరింది. మే 21న ఆసుపత్రిలో చేరగా... అదే రోజు ఆడబిడ్డకు జన్మనిచ్చింది. అప్పుడే పుట్టిన బిడ్డతో పోటు.. మిగిలిన ఇద్దరు పిల్లలు కూడా మహిళ వద్దే ఉన్నారు. అయితే భార్య వద్ద.. ఆనంద్ తన తల్లిని ఉంచేవాడు. తాను ఇంటివద్ద పనులు పూర్తి చేసుకుని.. తన ఇద్దరు పిల్లలను కూడా ఆసుపత్రికి తీసుకువచ్చి తల్లి వద్ద వదిలేసి వెళ్లేవాడు.

మంగళవారం సాయంత్రం నుంచి తల్లి, పిల్లలు ఒక్కసారిగా కనిపించకపోవటంతో.. కంగారుపడిన ఆనంద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆసుపత్రి అంతా గాలించినా భార్య, పిల్లల జాడ తెలియక పోవటంతో పీఎస్​లో ఫిర్యాదు చేశారు. నలుగురి అదృశ్యంపై... పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

ఇవీ చూడండి:'చలానా ఖరీదు... ఓ పసివాడి నిండు ప్రాణం'

ABOUT THE AUTHOR

...view details