Mother Jumped into Well with kids : కర్నూలు జిల్లాలోని పూలతోటలో విషాదం నెలకొంది. కర్నూలు మండలంలో ఓ మహిళ తన ఇద్దరు పిల్లలతో కలిసి బావిలో దూకింది. ఘటనలో పిల్లలిద్దరు మరణించగా.. తల్లి పరిస్థితి విషమంగా ఉంది.
Mother Jumped into Well with kids : ఇద్దరు పిల్లలతో సహా బావిలోకి దూకిన తల్లి - family suicide in Kurnool
శివరాత్రి పండుగకు పుట్టింటికి వచ్చిన ఓ మహిళ ఇద్దరు పిల్లలతో సహా బావిలోకి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాదకర ఘటన ఏపీలోని కర్నూలు మండలంలోని ఓ పూలతోటలో చోటుచేసుకుంది.
Suicide
ఈ ఘటనకు కుటుంబ కలహాలే కారణమని.. బాధిత మహిళ బంధువులు తెలిపారు. బాధిత మహిళ మనీషాకు 2016లో పవన్ కుమార్‌రెడ్డితో వివాహం జరిగింది. శివరాత్రికి తల్లిగారి ఊరైన పూలతోటకు వచ్చిన మనీషా ఈ దారుణానికి పాల్పడింది.