సిమ్ నెట్వర్క్ యాక్టివేషన్ పేరుతో మోసాలకు పాల్పడుతున్న సైబర్ నేరగాడిని రాచకొండ సైబర్ క్రైం పోలీసులు అరెస్ట్ చేశారు. ఝార్ఖండ్ జాంతారకి చెందిన బీర్బల్ పండిట్ను అరెస్ట్ చేసి అతని వద్ద నుంచి ఏటీఎం, పాన్, ఆధార్ కార్డులను స్వాధీనం చేసుకున్నారు. జనవరి నెలలో ఓ బాధితురాలి చరవాణికి మీ ఎయిర్టెల్ నెట్ వర్క్ గడువు ముగుస్తుందని... రీ యాక్టివేషన్ చేయాలని సందేశం వచ్చింది.
ఓ వ్యక్తి ఫోన్ చేయగా స్పందించిన బాధితురాలు... అతను చెప్పినట్లుగా క్విక్ సపోర్ట్ యాప్ డౌన్లోడ్ చేసుకుంది. రీ యాక్టివేషన్ ఛార్జ్ కింద 10 రూపాయలు ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా పంపమని చెప్పాడు. ఆమె ఫోన్లో ఇన్స్టాల్ అయిన యాప్ ద్వారా.. ఫోన్ను తన ఆధీనంలోకి తీసుకున్నారు.