మైనర్ బాలికపై అత్యాచారం.. భవనంపై నుంచి దూకిన మైనర్ - బాలికపై ప్రియుడి అత్యాచారం
10:51 June 15
నిజామాబాద్‌లో మైనర్ బాలికపై అత్యాచారం
నిజామాబాద్ నగరంలో దారుణం చోటుచేసుకుంది. ఓ మైనర్ బాలిక(17) గత నెల 31న భవనంపై నుంచి దూకి ఆత్మహత్యాత్నం చేసింది. తీవ్ర గాయాలపాలైన ఆమెను కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. 14 రోజుల పాటు చికిత్స పొందిన ఆ బాలిక ఇటీవలే కోలుకుంది. కోలుకున్న తర్వాత తాను ఆత్మహత్యకు పాల్పడటానికి గల కారణాన్ని కుటుంబ సభ్యులకు వివరించింది.
తాను ప్రేమించిన అబ్బాయి తనని మోసం చేశాడని.. తనపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడని మైనర్ బాలిక తన కుటుంబ సభ్యులకు చెప్పింది. విషయం తెలుసుకున్న ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న అతడి కోసం గాలిస్తున్నారు.