సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం చదువుతున్న సంతోశ్ గురువారం ఉదయం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈరోజు ఉదయం బయో కెమిస్ట్రీ పరీక్ష ఉందని వసతి గృహం నుంచి కళాశాలకు వెళ్లిన సంతోశ్.. కాసేపటికే తిరిగి వచ్చాడు.
వైద్య విద్యార్థి ఆత్మహత్య.. ప్రేమ విఫలమే కారణం! - siddipet district crime news
ప్రేమలో విఫలమైన ఓ యువకుడు తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన సిద్దిపేట జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలికి చేరుకుని కేసు నమోదు చేసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
ప్రేమలో విఫలమై.. వైద్య విద్యార్థి ఆత్మహత్య!
ఎవరూ లేని సమయంలో తన గదిలో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. యువకుడి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. సంఘటనాస్థలిలో పోలీసులకు లభ్యమైన సూసైడ్ నోట్లో.. ప్రేమలో విఫలమవ్వడమే తన చావుకు కారణంగా పేర్కొన్నాడు.