మహబూబ్‌నగర్ జిల్లా నవాబ్‌పేట మండలం కిషన్‌గూడాలో విషాదం చోటుచేసుకుంది. భర్తకు దూరంగా ఉంటున్నాననే మనస్తాపంతో చైతన్య అనే ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. కిషన్‌గూడ గ్రామానికి చెందిన చైతన్య వివాదాల కారణంగా కొన్ని నెలలుగా భర్తకు దూరంగా ఉంటోంది. ఈ క్రమంలోనే మనస్తాపానికి గురైన చైతన్య.. మూడు రోజుల క్రితం క్రిమి సంహారక మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది.
భర్తకు దూరమయ్యానని మనస్తాపం.. వివాహిత ఆత్మహత్య
భర్తకు దూరంగా ఉంటున్నాననే మనస్తాపంతో ఓ వివాహిత తనువు చాలించింది. క్రిమి సంహారక మందు తాగి ఆత్మహత్యకు యత్నించగా.. చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ ఘటన మహబూబ్‌నగర్‌లో చోటుచేసుకుంది.
వివాహిత ఆత్మహత్య
గమనించిన కుటుంబసభ్యులు ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.