Married suicide attempt in Manchryala district: భర్త కాపురానికి తీసుకెళ్లడం లేదని మనస్తాపం చెంది ఓ వివాహిత ఆత్మహత్యయత్నానికి పాల్పడింది. ఎస్సై ఆంజనేయులు కథనం ప్రకారం కన్నాల గ్రామానికి చెందిన వొడ్నాల మౌనికకి, బెల్లంపల్లి పట్టణంలోని శాంతిఖని బస్తీకి చెందిన వొడ్నాల నరేష్‌తో 2014లో వివాహమైంది. 2015లో ఆమె తండ్రి చనిపోవడంతో వారసత్వంగా నరేష్‌కు సింగరేణి సంస్థలో ఉద్యోగం వచ్చింది.
వారిద్దరి మధ్య వచ్చిన గొడవలు కారణంగా 5 సంవత్సరాల నుంచి దూరంగా ఉంటున్నారు. 2018లో ఆమె నరేష్‌పై కోర్టులో ప్రైవేట్ కేసు వేసింది. కోర్టుకు సైతం ఆమె భర్త గైర్హాజరవుతుండే వాడు. దీంతో ఆమె మనస్తాపానికి గురై గడ్డి మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. వెంటనే ఆమెను దగ్గరల్లో ఉన్న బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ విషయంపై కేసు నమోదు చేసుకొని ఆరా తీస్తున్నట్లు రెండో పట్టణ ఎస్సై ఆంజనేయులు తెలిపారు.