మహబూబాబాద్ జిల్లా మరిపెడ పోలీస్ స్టేషన్లో ఎస్ఐగా పనిచేస్తున్న శ్రీనివాస రెడ్డి.. లైంగిక వేధింపుల ఆరోపణలతో సస్పెండ్ అయ్యారు. ఇవాళ మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు వేగంగా జరిగిన పరిణామాలు చివరకు ఎస్ఐ సస్పెన్షన్‌కు దారి తీశాయి. ఇదే పోలీస్ స్టేషన్లో శిక్షణ పొందుతున్న మహిళా ఎస్ఐ... శ్రీనివాస రెడ్డి తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారంటూ... వరంగల్ పోలీస్ కమిషనర్‌ను ఆశ్రయించడం వల్ల ఈ విషయం వెలుగులోకి వచ్చింది. బాధితురాలు తన కుటుంబసభ్యులతో కలిసి సీపీ తరుణ్జోషిని కలిసి తనకు న్యాయం చేయాలని కోరారు. గత రాత్రి తననుఅడవిలోకి తీసుకెళ్లి లైంగిక దాడికి యత్నించారనిశిక్షణ మహిళ ఎస్ఐ ఫిర్యాదుచేశారు. వెంటనే స్పందించిన సీపీ.. ఆరోపణలు రుజువైతే.. చట్టపరంగా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.
అనంతరం మహబాబాబాద్ జిల్లా పోలీసు అధికారులు విచారణ ప్రారంభించారు. ఎస్ఐ శ్రీనివాస రెడ్డిని అదుపులోకి తీసుకొన్న జిల్లా ఎస్పీ కోటిరెడ్డి.. విచారణ ప్రారంభించారు. వెనువెంటనే ఐజీ నాగిరెడ్డి సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీచేశారు. విచారణ అనంతరం తదుపరి చర్యలు తీసుకుంటామని ఎస్పీ కోటిరెడ్డి స్పష్టం చేశారు.
ఉదయం రివార్డు అందుకొని..
ఈ ఉదయమే రివార్డు తీసుకున్న ఎస్ఐ శ్రీనివాస రెడ్డి... సాయంత్రానికే సస్పెండ్ అయ్యారు. మంగళవారం తెల్లవారుజామున మూడు వాహనాల్లో అక్రమంగా తరలిస్తున్న 120 క్వింటాళ్ల నల్లబెల్లం, 4 క్వింటాళ్ల పట్టికను.. సీజ్ చేసినందుకు.. జిల్లా ఎస్పీ కోటిరెడ్డి చేతుల మీదుగా శ్రీనివాస రెడ్డి రివార్డు అందుకున్నారు. మహిళా ట్రైనీ ఎస్ఐపై లైంగిక వేధింపుల ఆరోపణలతో సాయంత్రానికే సస్పెండ్ అయ్యారు.
మహిళా కాంగ్రెస్ ఆగ్రహం..
రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు సునీతారావు ఆరోపించారు. దళిత ట్రైనీ ఎస్‌ఐపై.. అదే స్టేషన్‌కు చెందిన ఎస్‌ఐ అత్యాచారానికి యత్నించడాన్ని ఖండిస్తున్నట్లు తెలిపారు. దళిత బంధు అంటున్న సీఎం కేసీఆర్ ఈ ఘటనతో సిగ్గుపడాలన్నారు. మహిళల సమస్యలపై వినతిపత్రం ఇవ్వడానికి తమకు డీజీపీ అనుమతి ఇవ్వకపోవడం సరైంది కాదన్నారు.
దళితుల కోసం చట్టాలు చేయండి..
మరిపెడలో ట్రైనీ ఎస్ఐపై అత్యాచారయత్నం చేసిన ఎస్ఐ శ్రీనివాస రెడ్డిపై చర్యలు తీసుకోవాలంటూ మహబూబాబాద్ పట్టణంలోని అంబేడ్కర్ విగ్రహం ముందు దళిత సంఘాలు ధర్నా చేశాయి. బాధితురాలికి న్యాయం చేయాలని నినాదాలు చేశారు. మరియమ్మ ఘటన మరవకముందే.. ఓ ట్రైనీ ఎస్ఐపై లైంగిక దాడికి యత్నించడం దారుణమన్నారు. దళితుల హక్కులు కాపాడేందుకు చట్టాలు చేయాలని డిమాండ్ చేశారు.
ఇదీచూడండి:TRAINEE WOMAN SI COMPLAINT: మహిళా ట్రైనీ ఎస్సైని అడవుల్లోకి తీసుకెళ్లి... !