Maoists Burn Vehicles: తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ సరిహద్దు అటవీ ప్రాంతంలో మావోయిస్టులు మరో దుశ్చర్యకు పాల్పడ్డారు. ఇటీవల మాజీ సర్పంచ్ రమేశ్‌ని హత్య చేసిన మావోయిస్టులు.. బుధవారం రాత్రి మళ్లీ విరుచుకుపడ్డారు. ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లాలో రోడ్డు నిర్మాణంలో ఉన్న మూడు వాహనాలను దహనం చేశారు.
Maoists burn vehicles: మావోయిస్టుల దుశ్చర్య... వాహనాలకు నిప్పు అంటించి.. - ఛత్తీస్‌గఢ్
Maoists Burn Vehicles: మావోయిస్టులు దుశ్చర్యలను ఇంకా కొనసాగిస్తూనే ఉన్నారు. మాజీ సర్పంచ్ హత్య మరిచిపోక ముందే.. బుధవారం రాత్రి ఛత్తీస్‌గఢ్‌లోని బీజ్పూర్ జిల్లాలో రహదారి పనులు చేస్తున్న వాహనాలకు నిప్పంటించారు.
వాహనాలకు నిప్పు అంటించిన మావోయిస్టులు
బీజాపూర్ జిలాల్లోని ఆవుపల్లి బాసగూడ మార్గంలో అధికారులు కొన్నిరోజుల నుంచి రోడ్డు నిర్మాణ పనులు చేస్తున్నారు. నిర్మాణ పనులకు వినియోగించే మూడు వాహనాలకు మావోయిస్టులు నిప్పు పెట్టారు. ఈ చర్యకు 10 నుంచి 12 మంది మావోయిస్టులు పాల్గొన్నట్లు జిల్లా ఎస్పీ కమలాలోచన కశ్యప్ ధ్రువీకరించారు.
ఇదీ చూడండి:EX Sarpanch Ramesh Murder: ఇన్‌ఫార్మార్ల గుండెల్లో గుబులు రేపుతున్న మాజీ సర్పంచ్ హత్య