MAOIST ARREST in VIZAG : ఏపీలోని విశాఖ మన్యంలో మావోయిస్టు ఏరియా కమిటీ సభ్యుడిని సీలేరు పోలీసులు అరెస్టు చేశారు. జిల్లాలోని గూడెం కొత్తవీధి మండలం సీలేరు పోలీసు స్టేషన్ పరిధిలోని సప్పర్ల కూడలిలో.. పెదబయలు ఏరియా కమిటీ సభ్యుడు కొర్రా సింగ్రు అలియాస్ సుందరరావును అరెస్టు చేశారు. ఒడిశాలోని మల్కన్‌గిరి జిల్లా చిత్రకొండ బ్లాక్పాలెం గ్రామానికి చెందిన సింగ్రూ.. 2000 సంవత్సరంలో మావోయిస్టు పార్టీలో చేరాడు. గాలింపు చర్యలను నిర్వహిస్తున్న పోలీసు బలగాలను లక్ష్యం చేసుకుని మందుపాతరలు పేల్చడానికి కొంతమంది మిలీషియా సభ్యులతో వెళ్తుండగా.. సప్పర్ల కూడలి వద్ద పోలీసులకు చిక్కాడు. సింగ్రూ వద్ద నుంచి దేశవాళీ తుపాకీ, బుల్లెట్లు, మందుపాతర, రెండు డిటోనేటర్లు, 60 మీటర్ల కరెంటు వైరును స్వాధీనం చేసుకున్నట్లు విశాఖ జిల్లా ఎస్పీ కృష్ణారావు తెలిపారు.
MAOIST ARREST in VIZAG : విశాఖలో మావోయిస్టు ఏరియా కమిటీ సభ్యుడు అరెస్ట్ - ap news
MAOIST ARREST in VIZAG : ఏపీలోని విశాఖ మన్యంలో మావోయిస్టు సభ్యుడిని పోలీసులు అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి తుపాకీతో పాటు పేలుడుకు ఉపయోగించే వస్తువులను స్వాధీనం చేసుకున్నారు.
MAOIST ARREST in VISHAKA : మావోయిస్టు సుందరరావుపై సుమారు 70 వరకు కేసులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఇన్‌ఫార్మర్ల పేరిట జరిగిన నాలుగు హత్యల‌్లో, రెండు మందుపాతరలు పేల్చిన ఘటనల్లో, 5 ఎదురుకాల్పుల సంఘటనల్లో పాల్గొన్నాడని పోలీసులు వెల్లడించారు. మావోయిస్టులు, మిలీషియా సభ్యులకు చెందిన సమాచారం తమ వద్ద ఉందని, వీరు స్వచ్ఛందంగా లొంగిపోతే ప్రభుత్వ పరంగా సాయాన్ని అందిస్తామని ఎస్పీ కృష్ణారావు తెలిపారు.
ఇదీ చూడండి:Orphans as state children : రాష్ట్ర బిడ్డలుగా అనాథ పిల్లలు.. ప్రత్యేక స్మార్ట్ ఐడీ కార్డులు!