తెలంగాణ

telangana

ETV Bharat / crime

NUDE VIDEO CALLS: మత్తెక్కించే మాటలు.. ఉద్రేకపరిచే చేష్టలు.. ఆ తర్వాత ఏంటో తెలుసా?

సైబర్​ కేటుగాళ్లు కొత్త తరహా మోసాలకు తెరతీస్తున్నారు. సామాజిక మాధ్యమాల ద్వారా చరవాణి నంబర్లు సేకరించి... పరిచయం పెంచుకుంటున్నారు. ఆ తర్వాత వాట్సాప్ వీడియో కాల్ చేసి నగ్నంగా దర్శనమిస్తున్న మహిళలు... ఎదుటి వ్యక్తులను నగ్నంగా కనిపించేలా ప్రోత్సహిస్తున్నారు. ఆయా దృశ్యాలను రికార్డు చేసి బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. తాజాగా హైదరాబాద్​ లంగర్​హౌస్​ పీఎస్​ పరిధిలో సైబర్ నేరగాళ్ల బెదిరింపులకు తట్టుకోలేక ఓ యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు.

NUDE VIDEO CALLS
NUDE VIDEO CALLS

By

Published : Aug 13, 2021, 5:18 PM IST

తేనేలాంటి పలుకులు.. మత్తెక్కించే మాటలు.. ఉద్రేకపరిచే చేష్టలు.. అచ్చం చిరకాల పరిచయస్థురాలిగానే పలకరింపులు.. తొలుత వాట్సాప్ చాటింగ్​తో మాటలు కలిపి... అవి కాస్త వీడియో కాల్స్​ వరకూ వెళ్తున్నాయి. ఇక్కడి నుంచే అసలు కథ మొదలవుతుంది. మాటలు కాస్త హద్దు మీరి చేష్టల వరకు వెళ్తాయి. ఒంటిపై ఉన్న ఒక్కో వస్త్రాన్ని తీసేసి... నగ్నంగా దర్శనమిస్తారు. ఎదుటి వ్యక్తిని అలానే చేయమంటూ కవ్విస్తారు. పర్యవసానాలు మరచి బట్టలు తీశారో ఇక అంతే...ఆ వీడియో కాల్​ అయిపోయేంత వరకు అంతా బాగానే ఉన్నట్లు అనిపించినా... మరుసటి రోజు నుంచి మీకు ఫోన్స్​ మొదలవుతాయి.

నగ్నంగా ఉన్న దృశ్యాలు సేకరించి..

మీతో వీడియో కాల్స్​ మాట్లాడుతున్నప్పుడే.. నగ్నంగా ఉన్న దృశ్యాలను రికార్డు చేసి.. బెదిరింపులకు పాల్పడతారు. చెప్పినన్ని డబ్బులు ఇవ్వకపోతే సామాజిక మాధ్యమాల్లో అప్​లోడ్​ చేస్తానంటూ బ్లాక్​ మెయిల్​ చేస్తారు. ఈ తరహా నేరాలు ఎక్కువగా నమోదవుతున్నట్లు సమాచారం.

తాజాగా హైదరాబాద్​ లంగర్​హౌస్​ పోలీస్​స్టేషన్​ పరిధిలో శివకుమార్​ నాయక్​ అనే యువకుడు.. సైబర్​ మాయగాళ్ల బెదిరింపులు తట్టుకోలేక బలవన్మరణానికి పాల్పడ్డాడు. 'గత కొన్ని రోజులుగా శివకుమార్​ ఓ యువతితో చాటింగ్​ చేశాడు. ఆ క్రమంలో నగ్న దృశ్యాలు సేకరించిన సదరు యువతి బెదిరింపులకు పాల్పడింది. ఆయా దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో ఉంచితే పరువు పోతుందనే భయంతో బలవన్మరణానికి పాల్పడ్డాడు' అని శివకుమార్​ బంధువులు ఆవేదన వ్యక్తం చేశారు.

రెచ్చిపోయి దుస్తులు తీసేసి..

ఇటీవల కాలంలో నగ్నదృశ్యాల బారిన పడుతున్న వారు.. సైబర్ పోలీస్ స్టేషన్లలకు క్యూ కడుతున్నారు. ఉద్రేకంలో రెచ్చిపోయి దుస్తులు విప్పి .. అనంతరం అసలు విషయం గ్రహిస్తున్న బాధితులు.. సైబర్​ నేరగాళ్ల గాలానికి చిక్కి విలవిల్లాడుతున్నారు.

రూ.2 లక్షలు చెల్లించినా...

హైదర్​గూడకు చెందిన ఓ యువకుడు.. వాట్సాప్ ద్వారా పరిచయమైన ఓ మహిళతో పరిచయం పెంచుకున్నాడు. అది కాస్త న్యూడ్​ వీడియో కాల్స్​ వరకూ వెళ్లింది. ఆ తర్వాత మహిళ నుంచి బెదిరింపులు ఎక్కువయ్యాయి. దాంతో భయాందోళనకు గురైన బాధితుడు.. ఆమె ఖాతాకు రూ.2 లక్షలు బదిలీ చేశాడు. అయినా బెదిరింపులు ఆగకపోవడంతో.. రెండు రోజుల క్రితమే సైబర్​ పోలీసులను ఆశ్రయించాడు.

గచ్చిబౌలికి చెందిన సాఫ్ట్​వేర్​ ఇంజినీర్..

గచ్చిబౌలికి చెందిన సాఫ్ట్​వేర్​ ఇంజినీర్​.. కొన్ని నెలలుగా ఇంటి నుంచే పనిచేస్తున్నాడు. పని ముగిసిన అనంతం కాలక్షేపం కోసం పోర్న్​ సైట్లు చూసే అలవాటు చేసుకున్నాడు. ఈ క్రమంలోనే మెయిల్​ ద్వారా అతనికి ఓ మహిళ పరిచయం అయింది. అనంతరం ఫోన్​ నంబర్లు మార్చుకున్నారు.. అది అలా నగ్నంగా వీడియో కాల్స్​ చేసుకొనేంతవరకూ వెళ్లింది. అందరిలానే అతను కూడా భయపడి.. ఆమె ఖాతాకు రూ.75 వేలు బదిలీ చేశాడు. అయినా బెదిరింపులు ఆపకపోవడం వల్ల... సైబర్​ పోలీస్​ స్టేషన్​ గడపతొక్కాడు.

రాజస్థాన్​ ముఠానే..

అయితే ఈ తరహా ఫిర్యాదులు ఎక్కువవ్వడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. రాజస్థాన్​కు చెందిన భరత్​పూర్​ ముఠానే.. ఇలాంటి మోసాలకు పాల్పడుతున్నట్లు ప్రాథమికంగా గుర్తించారు.

మోసాలు ఎలా చేస్తున్నారంటే..

'పోర్న్​సైట్లలో అశ్లీల దృశ్యాలను సైబర్​ నేరగాళ్లు ముందుగానే డౌన్​లోడ్​ చేసుకుంటారు. వాయిస్​ చేంజ్​ యూప్​ ద్వారా.. మహిళల్లా మాట్లాడి.. ముగ్గులోకి దించుతున్నారు. సోషల్​ మీడియా సైట్ల ద్వారా పరిచయం పెంచుకొని.. మొబైల్​ నంబర్​ సేకరిస్తున్నారు. అనంతరం వాట్సాప్​ ద్వారా న్యూడ్​ వీడియో కాల్​ చేసి.. ఇవతలి వ్యక్తి కూడా బట్టలు విప్పేలా ఉద్రేకపరిచి.. తీరా దుస్తులు తీసేయగానే.. అప్పటికే సిద్ధం చేసుకున్న కెమెరా ద్వారా ఎదుటివారి నగ్నదృశ్యాలను రికార్డు చేస్తున్నారు' అని పోలీసులు తెలిపారు.

గుర్తు తెలియని వ్యక్తుల నుంచి వచ్చే వాట్సాప్​ వీడియో కాల్స్​కు ఎట్టి పరిస్థితుల్లోనూ.. సమాధానం ఇవ్వొద్దని.. సైబర్​ క్రైం పోలీసులు సూచిస్తున్నారు. బ్యాంకు సంబంధిత లావాదేవీలు, బీమా, లాటరీ, పెట్టుబడులు, కరోనా మందులు వంటి మోసాలు చేస్తూ వచ్చిన సైబర్​ నేరస్థులు.. తాజాగా న్యూడ్​ వీడియో కాల్స్​ను ఎంచుకున్నారని.. అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.

ఇవీచూడండి:Cyber Crime: 'ఏడీ-షిక్తా' పేరిట ఎస్​ఎంఎస్​లు.. క్లిక్​ చేస్తే ఖాతా ఖల్లాస్

వాట్సాప్​లో ఆ లింక్​లను క్లిక్ చేస్తే.. ప్రమాదంలో పడ్డట్లే..!

ABOUT THE AUTHOR

...view details