తెలంగాణ

telangana

ETV Bharat / crime

Drunk and drive case : డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌లో చిక్కి పేరు తప్పు చెప్పాడు.. చివరకు..? - హైదరాబాద్​లో డ్రంక్ అండ్ డ్రైవ్

డ్రంక్ అండ్ డ్రైవ్(Drunk and drive case)​లో మీరు పోలీసులకు పట్టుబడ్డారనుకోండి. ఏం చేస్తారు? వాళ్లడిగిన వివరాలు చెప్పి.. మీ బైక్​ సీజ్ చేస్తే.. ఫైన్ కట్టి తెచ్చుకుంటారు. కానీ.. హైదరాబాద్ జూబ్లీహిల్స్​లో పోలీసులు చేపట్టిన డ్రంక్ అండ్ డ్రైవ్(Drunk and drive)​లో పట్టుబడ్డ ఓ వ్యక్తి.. తన పేరుకు బదులుగా వేరే వ్యక్తి పేరు చెప్పాడు. అలా పోలీసులకు తప్పుడు సమాచారం ఇచ్చి అప్పటికప్పుడు తప్పించుకున్నాడు. కానీ.. ఆ తర్వాత ఏమైందంటే..?

Drunk and drive case
Drunk and drive case

By

Published : Nov 13, 2021, 4:07 PM IST

డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌(drunk and drive search in jubilee hills)లో చిక్కి కేసు నమోదైన ఓ వ్యక్తి తన పేరు తప్పు చెప్పినట్లు గుర్తించిన పోలీసులు మరో కేసు నమోదు చేశారు. ఈ ఘటన హైదరాబాద్ జూబ్లీహిల్స్​(drunk and drive search in jubilee hills)లో చోటుచేసుకుంది.

హైదరాబాద్​ జూబ్లీహిల్స్​ రోడ్ నంబరు 36, పిల్లర్‌ నంబరు 1658 వద్ద ఈనెల 7న నారాయణగూడ ట్రాఫిక్‌ ట్రాఫిక్‌ ఎస్సై మల్లయ్య ఆధ్వర్యంలో డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ తనిఖీలు నిర్వహించారు. అటుగా వచ్చిన కారును నిలిపి చోదకుడి శ్వాస పరీక్ష చేయగా, రక్తంలో మద్యం మోతాదు శాతం 49 ఎంజీగా ఉన్నట్లు గుర్తించారు. ఈ క్రమంలోనే చోదకుడు తన పేరును దోమలగూడకు చెందిన నారల లలిత వరప్రసాద్‌గా తెలియజేయడంతో పోలీసులు మోటారు వాహన చట్టం కింద కేసు నమోదు చేశారు.

సమన్లు జారీ చేసే క్రమంలో అతని పేరు లలిత వరప్రసాద్‌ కాదని తెలుసుకున్నారు. అంతేకాకుండా మైనరు(minor got caught in drunk and drive)గా గుర్తించారు. ఈ మేరకు ఎస్సై మల్లయ్య గురువారం రాత్రి జూబ్లీహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details