ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి డబ్బులు ఇప్పిస్తానని... మోసాలకు పాల్పడుతున్న ఓ వ్యక్తిని ఉత్తర మండల టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. సీఎం కార్యదర్శి తనకు తెలుసంటూ నమ్మబలుకుతూ అలీ ఖాద్రీ మోసాలకు పాల్పడుతున్నాడు.
సీఎం సెక్రటరీ తెలుసంటూ మోసాలు.. అరెస్టు చేసిన పోలీసులు
ముఖ్యమంత్రి సహాయనిధి కింద డబ్బులు ఇప్పిస్తానని చెప్పి మోసాలకు పాల్పడుతున్న వ్యక్తిని నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయాన్ని బాధితుడు ట్విటర్లో పోస్ట్ చేయగా.. ముఖ్యమంత్రి సెక్రటరీ సంతోశ్ కుమార్ నగర పోలీసు కమిషనర్‌కు ట్విటర్ వేదికగా ఫిర్యాదు చేశారు.
సీఎం రిలీఫ్ ఫండ్ పేరుతో మోసం
ఈ క్రమంలోనే మహ్మద్ నజీర్ నుంచి 2లక్షలు తీసుకుని... పరారయ్యాడు. బాధితుడు పోలీసులను ఆశ్రయించగా... విచారణ చేపట్టిన పోలీసులు అలీ ఖాద్రీని అరెస్టు చేశారు. ఇంకా ఎంతమందిని మోసం చేశాడనే కోణంలో పోలీసులు ఆరాతీస్తున్నారు.
- ఇదీ చూడండి :'నా రాజకీయ జీవితాన్ని నాశనం చేయాలని కుట్ర'