మేడ్చల్ మల్కాజిగిరిలోని కీసరకు చెందిన భానుచందర్ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. కరోనా కారణంగా సంవత్సరం నుంచి ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్నాడు. ఈ నేపథ్యంలో యాదాద్రి భువనగిరిజిల్లాలోని తారకరామారావు నగర్లో ఉంటున్న అత్తవారి ఇంటికి మకాం మార్చాడు.
ఆర్థిక సమస్యలతో వ్యక్తి ఆత్మహత్య - వ్యక్తి ఆత్మహత్య
ఆర్థిక సమస్యలతో బాధపడుతూ ఓ వ్యక్తి ఇంట్లో ఉరివేసుకుని మృతి చెందాడు. ఈ ఘటన యాదాద్రి భువనగిరి జిల్లాలోని తారకరామారావు నగర్లో చోటు చేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఆర్థిక సమస్యలతో వ్యక్తి ఆత్మహత్య
ఉదయం తన గది నుంచి ఎంతకీ బయటకు రాకపోవడంతో కుటుంబసభ్యులు కిటికీలోంచి చూడగా... భానుచందర్ ఉరివేసుకున్నట్లు గుర్తించారు. వెంటనే జిల్లా కేంద్రం ఆస్పత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చూడండి:మట్టిలో కూరుకుపోయి ముగ్గురు చిన్నారులు మృతి